Begin typing your search above and press return to search.

మహారాష్ట్ర లో ఘోరం : తండ్రిని చంపేయండి అన్న కొడుకు .. అసలేమైంది ?

By:  Tupaki Desk   |   15 April 2021 10:37 AM GMT
మహారాష్ట్ర లో ఘోరం : తండ్రిని చంపేయండి అన్న కొడుకు .. అసలేమైంది ?
X
మహారాష్ట్రలో కరోనా కలకలం కొనసాగుతుంది. హాస్పిటల్స్ లో రోగులకు కనీసం బెడ్ కూడా దొరకని పరిస్థితి. ఇతర రాష్ట్రాలకి వెళ్లినా అక్కడ అదే పరిస్థితి. కరోనా సోకిన తన తండ్రిని ఆస్పత్రిలో చేర్పించడానికి మహారాష్ట్ర, తెలంగాణలో ఓ యువకుడు అంబులెన్స్‌ లో 24 గంటలపాటు తిరిగి అలసిపోయాడు కానీ బెడ్ దొరకలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆయన తన తండ్రికి హాస్పిటల్‌లో బెడ్ ఇవ్వండి లేదా ఓ ఇంజెక్షన్ ఇచ్చి చంపేయండి అని అడుగుతుంటే అక్కడ ఉన్న వారి కళ్లు చెమ్మగిల్లాయి.

వివరాల్లోకి వెళ్తే...చంద్రపూర్ ‌కు చెందిన సాగర్ కిశోర్ నహర్‌ షెట్టివార్ తండ్రి అనారోగ్యం పాలైయ్యాడు. దీనితో ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా చేదు అనుభవం ఎదురయ్యింది. పట్టణంలోని ఏ ఆస్పత్రికి తీసుకెళ్లినా ఎవ్వరూ చేర్చుకోలేదు. చికిత్స కోసం స్థానిక వారోరా ఆస్పత్రికి తీసుకెళ్లాం. అక్కడ నుంచి పలు ప్రయివేట్ హాస్పిటల్స్ ‌కు తరలించినా బెడ్స్ ఖాళీలేవని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకూ ఆస్పత్రుల కోసం తిరిగాం, చంద్రపూర్‌ లోని ఏ అస్పత్రిలోనూ బెడ్స్ ఖాళీ లేకపోవడంతో రాత్రి 1.30 గంట ప్రాంతంలో తెలంగాణకు బయలుదేరాం. తెల్లవారుజామున 3 గంటలకు చేరుకోగా అక్కడ హాస్పిటల్స్ ‌లోనూ పడకలు ఖాళీలేవని చెప్పడంతో బుధవారం ఉదయం నిరాశతో వెనుదిరిగాం , అప్పటి నుంచి ఇక్కడ పడిగాపులు కాస్తున్నాం అని ఆవేదన చెందాడు.

రోజంతా వృద్ధుడిని స్థానిక ఆసుపత్రి వెలుపల నిలిపిన అంబులెన్స్‌ లో ఉంచారు. ఆస్పత్రిలో చేర్చించడానికి దాదాపు 24 గంటలుగా వాహనంలోనే ఉండటంతో అందులోని ఆక్సిజన్ కూడా అయిపోవచ్చిందని తెలిపాడు. ఆయనకు ఓ బెడ్ ఇవ్వండి లేదంటే ఓ ఇంజెక్షన్ ఇచ్చి ప్రాణాలు తీయడండి.. ఈ పరిస్థితిలో ఆయనను ఇంటికి తీసుకెళ్లలేను.. మీరు పడకలు లేవంటున్నారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. . ఇక, మహారాష్ట్రలో పరిస్థితి రోజు రోజుకూ మరింత దిగజారిపోతోంది. ఆస్పత్రులో పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో తమకు తగినంత ఆక్సిజన్ సరఫరా చేయాలని ప్రధానిని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ఆక్సిజన్ కొరత వేధిస్తోందని, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ అవసరమవుతుంందని ఈ విషయంలో ఆర్మీ సహకరించాలని కోరారు.