Begin typing your search above and press return to search.
షాక్.. అమ్మ శవంతో మూడు రోజులు!
By: Tupaki Desk | 10 Sep 2017 5:30 PM GMTచనిపోయిన బంధువుల శవాలకు పూజలు చేయడం, వాటిని ఇంట్లోనే ఉంచుకుని జీవించడం - రోజుల తరబడి శవాలను ఇంట్లోనే ఉంచేసుకోవడం - ఆయా శవాల నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్లు ఫిర్యాదు చేయడం వంటి ఘటనలు దేశంలో అప్పుడప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మతిస్థిమితం కోల్పోయిన కుటుంబ సభ్యులు ఇలా వింతగా ప్రవర్తిస్తుంటారని ఆయా ఘటనల్లో పోలీసులు - మానసిక వైద్యులు వెల్లడించారు. ఇప్పుడు అలాంటి ఘటనే తాజాగా పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో వెలుగు చూసింది. మానసిక స్థితి సరిగా లేని ఓ యువకుడు తన తల్లి చనిపోయిన విషయాన్ని గుర్తించలేక పోగా.. అమ్మ కొన్ని రోజుల నుంచి నాతో ఏం మాట్లాడట్లేదు... ఆమె కోసం పప్పు - అన్నం వండా. కనీసం తినట్లేదు కూడా.. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
కోల్ కతాలోని దుర్గాపూర్ కు చెందిన ఇంద్రదీప్ నంది అనే వ్యక్తి 72 ఏళ్ల తన తల్లి సనంద నందితో స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల ఆమె మరణించింది. ఇంద్రదీప్ కు గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగ్గా లేకపోవటంతో ఆ విషయం బయటి ప్రపంచానికి తెలీకుండా పోయింది. చివరకు పొరుగున ఉన్న సోదరుడు ఇంద్రనీల్‌కు కూడా ఈ విషయం చెప్పలేదు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
అమ్మ నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. ఆమె కోసం వంట చేసినా తినట్లేదు. అని ఇంద్రదీప్ పోలీసులకు తెలిపాడు. వారం క్రితం తల్లిని చూడటానికి ఇంటికి వచ్చిన సోదరుడితో కూడా ఇదే సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. శనివారం ఈ ఘటనపై పోలీసులు అతన్ని సుదీర్ఘంగా ప్రశ్నించినా. అదే బదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆమె మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.