Begin typing your search above and press return to search.

ఇన్నాళ్లకు తన వారసుడు ఎవరో చెప్పేసిన కరుణ

By:  Tupaki Desk   |   10 May 2016 5:15 PM GMT
ఇన్నాళ్లకు తన వారసుడు ఎవరో చెప్పేసిన కరుణ
X
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఒక ప్రశ్నకు తాజాగా సూటిగా సమాధానం చెప్పేశారు డీఎంకే అధినేత.. తొంభయ్యో పడిలో ఉన్న కరుణానిధి. తన రాజకీయ వారసుడు ఎవరన్న విషయంతో పాటు.. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని ప్రకటించారు. తాజా ఎన్నికల్లో తమ పార్టీ కానీ గెలిస్తే.. తానే ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు.

కదల్లేని కరుణానిధి కొంతకాలంగా వీల్ ఛైర్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ తాను ముఖ్యమంత్రిగా ఆరోసారి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధంగా ఉన్న విషయాన్ని తాజా ప్రకటనతో వెల్లడించారు. అదే సమయంలో.. తనకు ఏదైనా జరిగితే.. తన తర్వాత ముఖ్యమంత్రిగా తన కుమారుడు స్టాలిన్ కు అవకాశం వస్తుందన్న విషయాన్ని కరుణ వెల్లడించారు.

సో.. కరుణ తర్వాత వారసుడు ఎవరన్న దానిపై ఊహాగానాలకు తెర దించి.. కరుణానిధే స్వయంగా ప్రకటించటం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.