Begin typing your search above and press return to search.
కర్ణాటక తాజా సీన్ వెనుక ప్రియాంక!
By: Tupaki Desk | 16 May 2018 4:37 AM GMTరాజకీయాలంటే ఆసక్తి ఉన్నా.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇష్టపడని తీరు ప్రియాంకలో కనిపిస్తూ ఉంటుంది. వృద్ధ కాంగ్రెస్‌కు సమర్థమైన నాయకత్వం అంటే.. అది ప్రియాంకతోనే సాధ్యమన్న మాట కాంగ్రెస్ శ్రేణుల్లో మొదట్నించి వినిపిస్తున్న మాటే. రాహుల్ మీద నమ్మకం కంటే ప్రియాంక మీదనే ఆ పార్టీ నేతల్లోనూ.. కార్యకర్తల్లోనూ నమ్మకం ఎక్కువని చెప్పాలి. ప్రియాంక కానీ సీన్లోకి దిగితే సితారే అన్న మాటను పలువురు కాంగ్రెస్ నేతలు అభివర్ణిస్తుంటారు.
ఇందిరమ్మ పోలికలు ప్రియాంకకు ఎక్కువని.. ఆమె రాజకీయ బరిలోకి దిగితే కాంబినేషన్లు మొత్తంగా మారిపోతాయన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. అదెంత వరకూ నిజమన్నవిషయంపై ఇప్పటివరకూ సరైన ఉదాహరణలు లేవు. తాజాగా కర్ణాటకలో నెలకొన్న తాజా రాజకీయం వెనుక ప్రియాంక ఉన్నారన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు.. జేడీఎస్ కు కీలకమైన బంగారప్పలు ముఖముఖాలు చూసుకునేందుకు సైతం ఇష్టపడనట్లు ఉండేవారు. అలాంటి ఇద్దరు నేతలు మీడియా ఎదుట పక్క పక్కన నిలుచొని మరీ తమ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని చెప్పటం వెనుక.. ప్రియాంక పాత్ర కీలకమని చెబుతారు.
కర్ణాటకలో చోటు చేసుకున్న ఎన్నికల పలితాల్ని సమీక్షించేందుకు సోనియా.. రాహుల్.. ప్రియాంకలు కలిసి లంచ్ చేశారని.. ఆ సందర్భంగా వారు డిసైడ్ చేసిన వ్యూహంతోనే కర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా చెబుతారు. తన తీరుకు భిన్నంగా క్షణంలో వెయ్యో వంతు అన్న రీతిలో కాంగ్రెస్ రియాక్ట్ కావటం.. సీఎం పదవిని చేపట్టేందుకు జేడీఎస్ ఓకే అనటం జరిగిపోయాయి.వీటన్నింటి వెనుక ప్రియాంక హస్తం ఉందన్న మాట వినిపిస్తోంది.
తనకున్న పరిచయంతోనే దేవెగౌడతో సంప్రదింపులు జరిపిన ప్రియాంక.. రెండు పార్టీల మధ్య కొత్త మిత్రత్వానికి తెర తీశారని చెబుతున్నారు. బీజేపీతో పోలిస్తే.. కాంగ్రెస్ నమ్మకమైన రాజకీయ మిత్రపక్షంగా దేవెగౌడ నోటి వెంట మాట రావటానికి కారణమని చెప్పక తప్పదు. తాను సీన్లోకి వస్తే.. రాజకీయాలు ఎలా మారిపోతాయన్నది ప్రియాంక శాంపిల్ చూపించారన్న మాటను కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తాజా పరిణామాల్ని చూస్తే.. ఒక విషయం అర్థమవుతుందని.. రానున్న రోజుల్లో ప్రియాంక ఎంట్రీ పక్కా అన్నది కర్ణాటక ఫలితాల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ వాదనలో నిజం ఎంతన్నది కాలం మాత్రమే డిసైడ్ చేయగలదు.