Begin typing your search above and press return to search.
దాసరి మరణంపై సోనియా రియాక్షన్ ఇది..
By: Tupaki Desk | 31 May 2017 8:57 AM GMTదర్శకరత్న దాసరి నారాయణరావు మరణంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పందించారు. ఆయన మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. దాసరి మృతి పట్ల ఆయన కుటుంబానికి తీవ్ర సంతాపాన్నిప్రకటించిన ఆమె.. చలనచిత్ర రంగంలో దాసరి ట్రెండ్ సెట్టర్ గా అభివర్ణించారు. సామాజిక అంతరాలు తొలిగించేలా సినిమాలు తీశారన్న సోనియా.. నిబద్ధత కలిగిన సామాజిక కార్యకర్తగా పేర్కొన్నారు.
దాసరి మరణంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సంతాపాన్ని తెలియజేస్తూ.. చలనచిత్ర పరిశ్రమ ఒక ప్రముఖుడ్ని కోల్పోయిందన్నారు. ఆయన మరణంతో తెలుగు సినిమాకు భారీ నష్టమన్న రాహుల్.. చలనచిత్ర ప్రముఖుడు.. మాజీ కేంద్రమంత్రి దూరం కావటంపై తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. దాసరి మరణంపై పలువురుప్రముఖులు స్పందించారు. ఆయన్ను కడసారి చూసేందుకు చిత్రపరిశ్రమకు చెందిన పెద్దలు పలువురు తరలివచ్చారు. దాసరి ఆకస్మిక మరణం తనను షాక్‌కు గురి చేసిందని.. సినీ రంగంలో అన్ని విభాగాలపై పట్టున్న విలక్షణమైన వ్యక్తిగా ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆసుపత్రిలో చేరటానికి రెండు రోజుల ముందు కూడా తనకు ఫోన్ చేసి మాట్లాడారని గుర్తు చేసుకున్నారు. తానంటే ఆయనకు ప్రత్యేక అభిమానం ఉందని.. దాసరి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లుగా చెప్పారు.
దాసరి కేవలం దర్శకుడిగానే కాకుండా రచయితగా.. నిర్మాతగా తనదైన ముద్ర వేశారని.. సినిమా రంగానికి ఏ కష్‌టం వచ్చినా ముందుగా ఆయన వచ్చే వారంటూ దాసరిని గుర్తు చేసుకున్నారు తనికెళ్ల భరణి.
దాసరి సినిమా రంగానికి మాత్రమే పరిమితమైన వ్యక్తి కాదని.. రాజకీయంగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు. ఈ మధ్యనే ఆయనతో తనకు సాన్నిహిత్యం ఏర్పడిందని.. ఆయన లేని లోటు పూడ్చలేనిదిగా వ్యాఖ్యానించారు.
ఎందరికో ఆశ్రయం ఇచ్చిన మహావ్యక్తి దాసరి అని వ్యాఖ్యానించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి. దాసరి ఒక చరిత్ర.. ఒక స్ఫూర్తిగా కొనియాడారు. ఇక.. జగన్ పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ.. ఆర్కే రోజాలు దాసరి భౌతికకాయాన్ని సందర్శించి.. నివాళులు అర్పించారు. ఈసందర్భంగా రోజా మాట్లాడుతూ.. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ జగన్ ను సీఎం చేస్తానని ఇటీవలే తనతో చెప్పినట్లుగా వ్యాఖ్యానించారు. దాసరి మరణంతో సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/