Begin typing your search above and press return to search.
సోనియా.. రాహుల్ కు ‘ఏపీ హోదా’ పట్టదా?
By: Tupaki Desk | 11 Sep 2016 9:21 AM GMTఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఏపీలో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. ఇంతకాలం ఏపీని పట్టిన హోదా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీతో ఈ వేడి ఢిల్లీని కూడా తాకింది. తిరుపతి సభ తర్వాత అరుణ్ జైట్లీ హడావుడిగా ఒక రోజు వ్యవధిలో కిందామీదా పడి ఏపీకి ఇవ్వాల్సిన ప్యాకేజీని ఫైనలైజ్ చేయగా.. కాకినాడ సభ పూర్తి అయిన గంటల వ్యవధిలోనే ఏపీ బీజేపీ నేతల్ని ఢిల్లీకి పిలపించుకొని మరీ ప్రధాని మోడీ మాట్లాడటం చూస్తే.. హోదా అంశం మోడీ సర్కారును ఎంతలా ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇంత జరుగుతున్నా ఈ అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కానీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కానీ.. హోదా మీద మాటిచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కానీ మాట్లాడకపోవటం గమనార్హం. ఏపీహోదా అంశంలో మోడీ సర్కారు అడ్డంగా ఇరుక్కుపోయి ఉక్కిరిబిక్కిరి అవుతూ.. హోదా డ్యామేజ్ నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటే..ఆ పార్టీని మరింత ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ ఎందుకు ప్రయత్నించటం లేదన్నది ఒక ప్రశ్న. నిజానికి ఏపీకి హోదా అన్న ఆశలుకల్పించిందే కాంగ్రెస్ పార్టీనే.
కాకుంటే ఐదేళ్లు ఇస్తామని మన్మోహన్ చెబితే.. కాదు పదేళ్లు అంటూ వెంకయ్యనాయుడు అనటం అందరికి గుర్తున్న విషయమే. కానీ.. అదేమీ జరగన్నట్లుగా సోనియా.. రాహుల్ గాంధీలు నోరు మెదపకపోవటం చూసినప్పుడు.. ఏపీని కాంగ్రెస్ అధినాయకత్వం పూర్తిగా వదిలేసిందా? అన్న సందేహం కలగక మానదు. వాస్తవానికి తమ రాజకీయ ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టే అవకాశం వచ్చినప్పుడు అస్సలు వదిలిపెట్టవు. కానీ.. హోదా ఎపిసోడ్ లో బీజేపీని ఇరుకున పెట్టే అవకాశం ఉన్నా.. సోనియా పరివారం ఎందుకు మాట్లాడటం లేదన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు. జైరాం రమేశ్ లాంటి వారు అప్పుడప్పుడు మాట్లాడుతున్నా.. విబజనలో కీలక పాత్ర పోషించిన డిగ్గీ రాజా.. మొయిలీ.. చిదంబరం లాంటి వారెవరూ నోరు విప్పుతున్నది లేదు. ఇదంతా చూస్తే.. తల్లీ కొడుకులకు ఏపీ హోదా పట్టదా? అన్న సందేహం కలగక మానదు.