Begin typing your search above and press return to search.
వివేక్ కు సోనియా ఏం హామీ ఇచ్చారు
By: Tupaki Desk | 25 Oct 2015 10:47 AM GMTపెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ టీఆరెస్ లో చేరుతారన్న ప్రచారానికి హఠాత్తుగా తెరపడింది. వివేక్ మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇవ్వడంతో ఊహాగానాలన్నీ ఆగిపోయాయి. ''నేను టీఆరెస్ లో చేరబోవడం లేదు.. కాంగ్రెస్ ను వీడడం లేదు'' అని తేల్చి చెప్పారు. దీంతో టీఆరెస్ లో ఆయన చేరిక లేనట్లేనని తేలిపోయింది. అంతేకాదు.... వివేక్ ను చేర్చుకుని వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయించాలని భావిస్తున్న టీఆరెస్ ఇప్పుడు కొత్త అభ్యర్థిని వెతుక్కనే పనిలో పడింది.
కాగా అంతకుముందు మాజీ కాంగ్రెస్ నేత - ప్రస్తుత టీఆరెస్ నేత అయిన కేకే ఇంట్లో హరీశ్ రావు వివేక్ తో భేటీ అయ్యారు. ఆయనకు వరంగల్ ఉప ఎన్నికల బరిలో నిలిపి గెలిపిస్తామని చెప్పారు. దాంతో వివేక్ టీఆరెస్ లో చేరడం.. వరంగల్ లో పోటీ చేయడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ, హరీశ్ ప్రతిపాదనకు వివేక్ నో చెప్పారు.
అయితే... వరంగల్ సీటు మంచి ఛాన్సేనని... వివేక్ ఎందుకు కాదన్నారో అర్థం కావడం లేదని రాజకీయవర్గాలు అంటున్నాయి. అధిష్ఠానం నుంచి ఆయనకు ఫోన్ వచ్చిందని.. ఏదో పెద్ద హామీయే లభించిందని చెబుతున్నారు. ఆ కారణంగానే ఆయన తాత్కాలిక ప్రయోజనాల కంటే దీర్ఘకాలిక ప్రయోజనాలు ముఖ్యమన్న ఉద్దేశంతో హరీశ్ ఆఫర్ ను కాదన్నారని తెలుస్తోంది.