Begin typing your search above and press return to search.
ఆ నేత వద్ద సోనియా మనసు విప్పారు
By: Tupaki Desk | 16 March 2016 11:30 AM GMTతెలంగాణలో కెసిఆర్ పాలనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఏమనుకుంటున్నారు.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా అధికారంలోకి రానందుకు ఆమె పశ్చాత్తాపపడుతున్నారా? రాజకీయంగా నష్టపోయామని భావిస్తున్నారా? పార్టీ భవిష్యత్తుకు ఏం చేయాలనుకుంటున్నారు? తమతో మంచిగా ఉండి తెలంగాణ సాధించుకుని ఇప్పుడు తమ పార్టీ నాయకులకే ఆకర్షిస్తున్న కేసీఆర్ తనను మోసం చేశారని ఆమె భావిస్తున్నారా..? ఇలాంటి కీలక అంశాలపై ఆమె ఆంధప్రదేశ్ కు చెందిన ఒక ముఖ్యనేత వద్ద మనసు విప్పి మాట్లాడినట్లు సమాచారం. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సోనియాతో చర్చించేందుకు వెళ్లిన ఆయనతో సోనియా చాలాసేపు మాట్లాడారని... తెలంగాణలో పరిస్థితులపై ఆయన వద్ద ఆరా తీశారని తెలిసింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. తెలంగాణలో అధికారంలోకి రాలేదు.. ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా నష్టపోయాం.. రాష్ట్రం ఇవ్వకున్నా బాగుండేదంటూ సోనియాగాంధీ వద్ద సదరునేత అనగా ఆమె తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. ఓట్లు - సీట్ల కోసం తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదని.. విద్యార్ధుల బలిదానాలకు చలించి.. త్యాగాలను గుర్తించి రాష్ట్రాన్ని ఇచ్చానని ఆమె అన్నట్లు తెలిసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తాను ఇవ్వకపోతే వచ్చి ఉండేది కాదని, బిజెపి అదికారంలోకి వచ్చినా.. ఇవ్వదని, అక్కడి ప్రజలు - విద్యార్ధుల ఆకాంక్ష తనను కదిలించిందని.. రాష్ట్రం ఇచ్చినా ఎపికి అన్యాయం జరగకుండా పునర్విభజన చట్టంలో పలు అంశాలు పేర్కొన్నా దురదృష్టవశాత్తు అమలు కావడం లేదని సోనియా అప్పటి పరిణామాలను వివరించినట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర విభజన సమయంలో తమకు సన్నిహితంగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తీరుపై ఆమె సదరు నేత వద్ద ఆరా తీసినట్లు తెలిసింది. రాష్ట్రం ఇచ్చినా రాజకీయంగా ఉపయోగం లేకపోగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలనే తమ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆయన సోనియాకు వివరించినట్లు తెలిసింది. పలువురు ఎమ్మెల్యేలతో పాటు డిఎస్ - బసవరాజు సారయ్య లాంటి సీనియర్లు పార్టీని వీడి టీఆర్ ఎస్ లో చేరిన అంశాలపై ఆమె విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు డిఎస్ అనేకసార్లు వచ్చి తెలంగాణ ఇస్తే పార్టీ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారని, అలాంటి సీనియర్ నేతలు పార్టీ మారడం ఆశ్చర్యంగా ఉందని, కెసిఆర్ కాంగ్రెస్ నేతలను కూడా చేర్చుకుంటారని ఊహించలేదని వ్యాఖ్యానించినట్లు సమాచారం. టీఆర్ ఎస్ కు పార్లమెంట్ లో బలం లేకున్నా.. ఎన్నో పార్టీలను ఒప్పించి... ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని రాష్ట్రం ఇచ్చామని.. ఆమె అన్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్య త్తుకు ఎలాంటి ఇబ్బందిలేదని, రాజకీయ పరి స్థితులను చక్కదిద్దుతామని చెప్పినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితులపై ఎప్పటికపుడు సమాచారం తెలుసుకుంటున్న సోనియా భవిష్యత్తు రాజకీయాలు, రాష్ట్రాల పరిస్థితులు, నాయకత్వాలకు సంబంధించి.. పక్కా ప్రణాళికతో, పక్కా వ్యూహాలతో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన దేవతగా కీర్తిప్రతిష్టలు సొంతం చేసుకున్న సోనియా గాంధీ తెలుగురాష్ట్రాలపై తనకున్న ఆసక్తిని - ఇష్టాన్ని - మమకారాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేయడంతో సదరునేత సంతోషంగా పార్టీ ముఖ్యుల వద్ద ఈ మాటలు పంచుకున్నట్లు తెలిసింది. సోనియా దృష్టి పెడితే.. తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో గణనీయంగా మార్పులు వచ్చే అవకాశముంది. రెండు రాష్ట్రాలలో స్తబ్దుగా ఉన్న నాయకులను, పార్టీకి దూరమైన సీనియర్లను మళ్ళీ ఏకం చేయాలని సూచించినట్లు తెలిసింది. సీనియర్లతో త్వరలో సమావేశం నిర్వహిద్దామని ఆమె సదరు నేతతో పేర్కొన్నట్లు సమాచారం.