Begin typing your search above and press return to search.
ఐసీయూలో సోనియా గాంధీ !!
By: Tupaki Desk | 4 Aug 2016 4:41 AM GMTకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు గురి కావటం తెలిసిందే. జ్వరం.. వాంతులతో ఇబ్బంది పడినట్లు చెబుతున్నప్పటికీ.. అంత చిన్న ఆరోగ్య సమస్యే చాఫ్టర్ విమానాన్ని బుక్ చేసి యుద్ధ ప్రాతిపదికన ఢిల్లీలో చికిత్స చేయిస్తారా? అన్నది ఒక ప్రశ్నగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. ఆమె డీహైడ్రేషన్ కు గురయ్యారని.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
మంగళవారం ఆమె.. మోడీ ఇలాకా వారణాసిలో యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లటం.. ఇందుకోసం కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. వారణాసిలో ఆమె రోడ్ షో మొదలైన కాసేపటికే తీవ్ర అనారోగ్యానికి గురి కావటంతో ఆమెను యుద్ధప్రాతిపదికన ఢిల్లీకి ప్రత్యేక విమానంలో చేర్చటం తెలిసిందే. ఆమె అనారోగ్యానికి గురయ్యారని తెలిసిన వెంటనే స్పందించిన ప్రధాని మోడీ.. ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మోడీ స్పందించిన తీరు పట్ల కాంగ్రెస్ థ్యాంక్స్ చెప్పటం.. అది కూడా సోషల్ మీడియా మాధ్యమం ద్వారా అంటే.. ప్రధాని రియాక్ట్ అయిన తీరు ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పినా.. ఆమె వెంట కుమారుడు రాహుల్.. కుమార్తె ప్రియాంకలు అక్కడే ఉండటం గమనార్హం. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొచ్చిన సోనియాను తొలుత సైనిక ఆసుపత్రిలో చికిత్స చేసి.. అనంతరం ఆమెను గంగారాం ఆసుపత్రికి తరలించారు.
గతంలో ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు గంగారాం ఆసుపత్రిలోనే వైద్యసేవలు పొందారు. ఇదిలా ఉంటే.. సైనిక ఆసుపత్రిలో సోనియా చికిత్స పొందుతున్న సమయంలో ఆసుపత్రికి రక్షణ మంత్రి పారికర్.. సైన్యాధ్యక్షుడు దల్బీర్ సింగ్ లు ఆమెను పరామర్శించారు. ఆరోగ్యం కుదుట పడిందని.. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్న సోనియాను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారన్న విషయాన్ని మీద వైద్యులు వెల్లడించటం లేదు.