Begin typing your search above and press return to search.
సోనియాకు అస్వస్థత..హుటాహుటిన తరలింపు
By: Tupaki Desk | 23 March 2018 11:27 AM GMTకాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కలవరపాటుకు గురయ్యే పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు - యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ స్వల్ప అనారోగ్యానికి లోనయ్యారు. సిమ్లాలో ఉన్న ఆమె హుటాహుటిన గురువారం రాత్రి చంఢీఘడ్ కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఆమెను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. అయితే సోనియా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆమె అస్వస్థతకు గురికావడం రెండో సారి.
తన కూతురు ప్రియాంకా వద్రాతో కలిసి సోనియా సిమ్లా వెళ్లారు. అయితే అక్కడ వాతావరణం సరిగా లేకపోవడంతో కాంగ్రెస్ నేత తీవ్ర అస్వస్థతకు లోనైట్లు తెలుస్తోంది. ట్రీట్ మెంట్ కోసం సిమ్లా నుంచి చంఢీఘడ్ వెళ్లినా.. అక్కడ ఆమె చికిత్స తీసుకోలేదు. పర్సనరల్ డాక్టర్ల సూచన మేరకు సోనియా మళ్లీ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సిమ్లాలోని చారబ్రా ప్రాంతంలో ప్రియాంకా ఓ కాటేజ్ నిర్మిస్తోంది. ఆ పనులను పర్యవేక్షించేందుకు సోనియా అక్కడకి వెళ్లారు. మంచు - వర్షాల వల్ల సోనియా అస్వస్థతకు లోనైనట్లు సమాచారం. కాన్సర్ బారిన పడిన నాటి నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏదో ఒక రూపంలో ఆరోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురవ్వడంతో ఆరోగ్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా అస్వస్థతకు గురవడంతో కాంగ్రెస్ పార్టీలో ఒకింత కలవరం మొదలైంది.