Begin typing your search above and press return to search.
వీహెచ్‌ని కలిసే అమ్మ డీఎస్‌ను కలవలేదా?
By: Tupaki Desk | 7 July 2015 6:05 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో నేతలు ఎవరూ వచ్చినా వారితో భేటీ కావటం.. పరిస్థితులు కనుక్కోవటం.. పార్టీ కోసం మరింతగా పని చేయాలని చెబుతూ.. పూర్వ వైభవం కోసం ఆశగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. కాంగ్రెస్ సీనియర్ నేత.. తాజాగా పార్టీకి గుడ్‌బై చెప్పిన డీఎస్ (ధర్మపురి శ్రీనివాస్) విషయంలో కాస్త దూరం పెట్టారా? అన్న ప్రశ్న వినిపిస్తోద.
పదేళ్లు యూపీఏ పవర్‌లో ఉన్నప్పుడు అమ్మ అపాయింట్‌మెంట్ కోసం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం క్యూల నిలుచునే పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల తర్వాత అందుకు భిన్నమైన పరిస్థితి. రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంతరావుతో పాటు.. పలువురు మాజీ ఎమ్మెల్యేలు.. ఎంపీలు వీలు కుదిరనప్పుడల్లా ఢిల్లీకి వెళ్లి అమ్మను కలుసుకొని వస్తున్న విషయం తెలిసిందే.
అలాంటి డీఎస్‌ను కలవటానికి ఏ మాత్రం మక్కువ చూపించలేదన్న వాదనలో నిజం లేదని చెబుతున్నారు. తనకు.. తన కుమారుడికి పదవులు ఇస్తానన్న కాంగ్రెస్ అధినాయకత్వం తాజాగా పట్టించుకోవటం లేదన్న డీఎస్ వాదన. వరుస ఓటమితో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పదవులు ఎవరికి ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఇవ్వాల్సిన వారి లిస్ట్ భారీగానే ఉంది.
అలాంటి సందర్భంలో పదవులు రాలేదన్న కినుకు సరికాదన్న వాదన వ్యక్తమవుతోంది. తనకు పదవులు రాలేదు కాబట్టే.. సోనియమ్మ తమను కలిసేందుకు సైతం ఇష్ట పడలేదని.. తమను అవమానపర్చారన్న ప్రచారంతో మరింత సానుభూతి పొందాలన్న ఉద్దేశ్యంతోనే డీఎస్ ఇలాంటి ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అందరిని కలిసే అమ్మ.. డీఎస్‌ను కలిసేందుకు ఎందుకు ఇష్టపడరు..?