Begin typing your search above and press return to search.

రాహుల్‌ ను సోనియా ప‌క్క‌న పెట్టేసిందిగా!

By:  Tupaki Desk   |   14 Aug 2017 5:38 AM GMT
రాహుల్‌ ను సోనియా ప‌క్క‌న పెట్టేసిందిగా!
X
సోనియా సంచ‌ల‌న నిర్ణ‌యం దేశాన్నిఉలిక్కి ప‌డేలా చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా రాహుల్‌ని చూద్దామ‌నుకున్న వారికి సోనియా ఒక్క‌సారిగా షాకిచ్చారు. అనూహ్యంగా ఆమె త‌న త‌న‌య ప్రియాంక వైపు మొగ్గు చూపారు. పార్టీ ప్రెసిడెంట్‌ గా రాహుల్‌ ను ప‌క్క‌న పెట్టి.. ప్రియాంక‌కు ప‌ట్టం క‌ట్టాల‌ని సోనియా డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఇంత సంచ‌ల‌న నిర్ణ‌యం వెనుక సోనియా భారీ ఎత్తున క‌స‌ర‌త్తు చేసింద‌నే అంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. రాహుల్ గాంధీ గ‌త కొన్నేళ్లు త‌న పెర‌ఫార్మెన్స్‌లో ఎలాంటి మార్పూ క‌న‌బ‌ర‌చ‌క‌పోగా.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి దీటైన నేత‌గా కూడా ఎద‌గ‌క‌పోవ‌డాన్ని సోనియా జీర్ణించుకోలేక పోతున్నార‌ట‌.

ముఖ్యంగా ఇటీవ‌ల యూపీ ఎన్నిక‌లు స‌హా బీహార్‌ లో మొన్నామ‌ధ్య ప్ర‌భుత్వం మార్పు విష‌యంలోనూ రాహుల్ అన్నీ తెలిసినా.. కూడా మోదీని ఎదుర్కొనే వ్యూహం సిద్ధం చేయ‌డంలోనూ దానిని అమ‌లు చేయ‌డంలోనూ తీవ్రంగా వెనుబ‌డి పోయారు. దీంతో బీహార్‌ లో ఇటీవ‌లి వ‌ర‌కు ఉన్న కాంగ్రెస్‌ - ఆర్జేడీ - జేడీయూ కూట‌మి ప్ర‌భుత్వాన్ని నితీశ్ కూల‌దోసి.. మోదీ ప‌క్క‌కు చేరిపోయారు. దీనికి స్కెచ్ అంతా మోదీ క‌నుస‌న్న‌ల్లోనే సాగిపోయింది. ఈ విష‌యం రాహుల్‌ కి తెలిసి కూడా రాజ‌కీయంగా వ్యూహ ప్ర‌తివ్యూహాలు సిద్ధం చేసి.. మోదీని బ‌లంగా ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. దీంతో బీహార్‌ లో కాంగ్రెస్ అధికార కూట‌మి నుంచి విప‌క్షంగా మారిపోయింది.

ఇక‌, ఏపీ - తెలంగాణ‌ల విష‌యంలోనూ రాహుల్ చూపిన శ్ర‌ద్ధ అంతంత మాత్రంగానే ఉంది. ఇక్కడ రాష్ట్రం విడిపోయి.. మూడేళ్ల‌కు పైనే అయిపోయింది. మ‌రో రెండేళ్ల‌లో ఈ రెండు రాష్ట్రాలూ ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్నాయి. అయితే, ఈ రెండుచోట్లా కాంగ్రెస్‌ కు భిన్న‌మైన నేప‌థ్యం ఉంది. విడ‌దీశార‌ని ఏపీలో కాంగ్రెస్‌ కు డిపాజిట్లు లేకుండా చేశారు. తెలంగాణ‌లో రాష్ట్రం ఇచ్చినా ఆ క్రెడిట్ కాంగ్రెస్‌ కు ద‌క్క‌లేదు. ఈ రెండు విష‌యాల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డం, 2019 కి పార్టీని సిద్ధం చేయ‌డం, నేత‌లను పోగేయ‌డం వంటి వాటిపై రాహుల్ విఫ‌ల‌మ‌య్యారు.

ఇక‌, తాజాగా గుజ‌రాత్ విష‌యంలోనూ రాహుల్ వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అక్క‌డ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో చ‌చ్చీచెడీ అహ్మ‌ద్ ప‌టేల్‌ ను గెలిపించుకోవ‌డం సోనియాకు మ‌రో అగ్నిప‌రీక్ష‌గా మారింది. ఇక్క‌డ పార్టీ నుంచి జెండా పీకేసిన శంక‌ర్ సింగ్ వాఘేలాను బుచ్చ‌గించ‌డం రాహుల్ వ‌ల్ల‌కాలేదు. దీంతో పార్టీ తీవ్రంగా న‌ష్టపోయింది. దీనిని గ‌మ‌నించిన సోనియా.. ప‌రిస్థితి ఇలానే ఉంటే.. 2019 పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో మోడీని ఓడించ‌డం క‌ష్ట‌మ‌ని భావించి.. రాహుల్‌ ను త‌ప్పించాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. అంటే.. పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాల‌ను ప్రియాంక‌కు అప్పగించటం ద్వారా మ‌రో ఇందిర‌మ్మ‌గా జ‌నాలు ఆమెను రిసీవ్ చేసుకుంటార‌ని, అధికారంలోకి రావ‌చ్చ‌ని సోనియా ప్లాన్ వేశార‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.