Begin typing your search above and press return to search.
ఆ మాట వినగానే సోనియా అలా చేస్తారా?
By: Tupaki Desk | 22 Nov 2016 10:05 AM GMTకాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురించి అందరికి తెలిసిన విషయాలు చాలానే ఉన్నాయి. అయితే.. కొందరికి మాత్రం ఆమెకు సంబంధించి మరిన్ని విషయాలు కూడా చెబుతుంటారు. అయితే.. ఎప్పుడూ లేని విధంగా తాజాగా ఆమెకు సంబంధించిన ఒక కొత్త కోణం బయటకు వచ్చింది. మరికొద్ది నలల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెలో తాజాగా ఒక కొత్త కోణం బయటకు వచ్చింది.
అలహాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న వేళ.. సభా వేదికకు దగ్గర్లోని మసీదు నుంచి అజాన్ (నమాజ్ పిలుపు) వినిపించింది. వెంటనే.. ఒక్క క్షణం తన ప్రసంగాన్ని ఆపిన సోనియా.. చీరకొంగునుతల మీద కప్పుకొని తన ప్రసంగాన్ని కొనసాగించటం గమనార్హం. కావాలని చేశారో.. లేక అనుకోకుండా అలా చేశారో కానీ.. ఈ కోణం కొత్తదిగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
యూపీలో ఎన్నికల్లో ముస్లిం మైనార్టీల ఓట్లు కీలకమైనవి. దాదాపు 30 శాతం ఓటుబ్యాంకుఉన్న మైనార్టీలను ఆకర్షించేందుకే సోనియా ఇలా చేసి ఉంటారని ఆమెరాజకీయ ప్రత్యర్థులు అభివర్ణిస్తున్నారు. గడిచిన 26 ఏళ్లుగా యూపీలో పవర్ కు దూరంగా ఉన్న కాంగ్రెస్.. తాజా ఎన్నికల్లో ఏదో విధంగా విజయం సాధించాలని భావిస్తోంది. అయితే.. కాంగ్రెస్ విజయం సాధ్యమే కాదని.. ఆ పార్టీకి పదికంటే తక్కువ అసెంబ్లీ స్థానాలు వస్తాయని పలు సర్వేలు వెల్లడించాయి. ఈ విషయాలు ఎలా ఉన్నా.. సోనియాగాంధీ ప్రవర్తించిన తీరు మాత్రం మైనార్టీల మనసులపై ప్రభావం చూపే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/