Begin typing your search above and press return to search.

సోనియా, రాహుల్‌ కు దిమ్మ‌తిరిగే కోర్టు తీర్పు

By:  Tupaki Desk   |   12 May 2017 10:08 AM GMT
సోనియా, రాహుల్‌ కు దిమ్మ‌తిరిగే కోర్టు తీర్పు
X
కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియాగాంధీ - యువ‌నేత‌ - ఆ పార్టీ ఉపాధ్య‌క్షులు రాహుల్‌ గాంధీకి ఊహించ‌ని ఎదురుదెబ్బ తగిలింది. గ‌తంలో కాంగ్రెస్ సార‌థ్యంలో ఉన్న నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. ఈ ఇద్ద‌రు నేత‌లు డైరెక్ట‌ర్లుగా ఉన్న యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఇన్‌ క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌ మెంట్‌ విచార‌ణ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.

అసోసియేట్ జ‌ర్న‌ల్స్ లిమిటెడ్ నుంచి రూ.90 కోట్ల విలువైన ఆస్తుల‌ను కేవలం రూ.50 ల‌క్ష‌లు చెల్లించి సోనియా, రాహుల్‌ గాంధీలు యంగిండియా ప్రైవేట్ లిమిటెడ్‌ కు క‌ట్ట‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు ఆస్కార్ ఫెర్నాండెజ్‌ - సుమ‌న్ దూబెతోపాటు శామ్ పిట్రోడా కూడా నిందితులుగా ఉన్నారు. ఇందులో 2015, డిసెంబ‌ర్‌ లోనే సోనియా - రాహుల్‌ ల‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఈ కేసు వేశారు. గ‌తంలో ప‌టియాలా హౌజ్ కోర్టు కూడా సోనియా - రాహుల్‌ ల‌పై ఇన్‌ క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌ మెంట్ విచార‌ణ‌కు ఆదేశించినా.. దానిని ఢిల్లీ హైకోర్టులో స‌వాలు చేశారు. కానీ అక్క‌డ కూడా ఈ ఇద్ద‌రు నేత‌ల‌కు ఊర‌ట ల‌భించ‌లేదు. తాజా ప‌రిణామం రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పెద్ద‌ల‌ను ఇర‌కాటంలో పడేసింద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/