Begin typing your search above and press return to search.

సోనియాగాంధీ వెల్ లోకి దూసుకొచ్చారు

By:  Tupaki Desk   |   19 Dec 2015 4:07 AM GMT
సోనియాగాంధీ వెల్ లోకి దూసుకొచ్చారు
X
లోక్ సభలో తన సీటులో కూర్చొని కనుసైగలతో పదేళ్లు దేశాన్ని సింగిల్ హ్యాండ్ తో నడిపిన సోనియాగాంధీ ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అధికారం చేజారి.. విపక్ష నేతగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో సోనియాకు ఇప్పుడు బాగానే తెలిసి వచ్చి ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ లో తిరుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. బీజేపీ నేతలు.. ఇండిపెండెంట్లు కలిసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నబమ్ టుకీని తొలగించేలా చేయటంపై పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది.

విపక్షాలన్నీ ఏకమై.. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ మీదా.. ఎన్డీయే సర్కారు మీదా విరుచుకుపడ్డాయి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోకూడదంటూ.. ఈ అంశంపై చర్చ కోసం కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే.. దీనికి లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు స్పీకర్ వెల్ లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. తన సీట్లో నుంచి పెద్దగా లేవకుడా.. తాను అనుకున్న పనిని చేయించే సత్తా ఉన్న సోనియమ్మ సైతం.. ఈ సారి తన సీటు నుంచి లేవక తప్పింది కాదు.

వెల్ లోకి దూసుకొచ్చిన సోనియాగాంధీ.. ఎన్డీయే సర్కారు తీరుకు వ్యతిరేకంగా గళం విప్పారు. కాలం కలిసి రాకపోతే.. ఎంతటి వారికైనా కొన్నిసార్లు తిప్పలు తప్పవు. తాను అధికారంలో ఉన్నప్పుడు తనకు తోచినట్లుగా వ్యవహరించిన సోనియ్మకు.. తాజాగా మోడీ సర్కారు నుంచి అలాంటి అనుభవాల్నే ఎదుర్కోవటం చూసినప్పుడు కాల మహిమ అని అనుకోవాల్సిందే.