Begin typing your search above and press return to search.
సోనియా విందుకు ఆ సీఎంను పిలవలేదు
By: Tupaki Desk | 25 May 2017 7:19 AM GMTవిపక్షాలకు పెద్దన్నగా వ్యవహరించేందుకు వృద్ధ కాంగ్రెస్ పడుతున్న ఇక్కట్లు అన్నిఇన్ని కావు. ఓ పక్క మోడీ అంతకంతకూ బలపడిపోతున్న వేళ.. ఒక్కొక్క రాష్ట్రాన్ని ఆక్రమించుకుంటున్న బీజేపీ తీరుతో కాంగ్రెస్ తో పాటు.. ఇతర పార్టీలు కళ తప్పిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్ష నేతలకు శుక్రవారం ఒక విందును ఏర్పాటు చేశారు. పార్లమెంటు హౌస్‌లో జరిగే ఈ విందుకు పశ్చిమ బెంగాల్.. బీహార్ ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ.. నితీశ్ కుమార్ తోపాటు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. పలు పార్టీ అధినేతలు హాజరు కానున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ విందు కార్యక్రమానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సోనియా నుంచి ఆహ్వానం అందలేదు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జట్టు కట్టిన సోనియా అండ్ కో.. మోడీ అంటేనే మండిపడే కేజ్రీవాల్ ను ఆహ్వానించకపోవటం ఆసక్తికరంగా మారింది. ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేపట్టిన ఏ కార్యక్రమానికి కేజ్రీవాల్ పాల్గొనకపోవటంతో సోనియా నిర్వహిస్తున్న విందుకు ఇన్విటేషన్ అందలేదన్న మాట వినిపిస్తోంది.
ఈ విందులోనే విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరిని డిసైడ్ చేయాలన్న విషయాన్ని ఫైనల్ చేస్తారని చెబుతున్నారు. రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థికి పోటీగా విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి నిలపాలని సోనియాగాంధీ పట్టుదలతో ఉన్నారు. అందుకే.. విపక్షాల్ని ఒక్కటి చేయటంతో పాటు.. ఉమ్మడి అభ్యర్థిని నిలపటం ద్వారా మోడీపై ఒత్తిడిపెంచాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ఈ విందుకు హాజరయ్యే అధినేతలకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు అందినట్లుగా చెబుతున్నారు. తాను ఇస్తున్న విందుకు రావాలని కమ్యూనిస్టు నేతలతో సహా పలువురు ముఖ్యులకు సోనియానే స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. మరి.. సోనియమ్మ విందు రాజకీయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/