Begin typing your search above and press return to search.
ఢిల్లీని వీడనున్న సోనియా ... కారణం ఇదే !
By: Tupaki Desk | 20 Nov 2020 2:33 PM GMTకాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గత కొన్నిరోజులుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. సోనియాగాంధీ దీర్ఘకాలిక ఛాతీ ఇన్ఫెక్షన్ తో భాదపడుతున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో మళ్లీ కాలుష్యం భారీగా పెరిగిపోయిన సమయంలో కొన్ని రోజుల పాటు ఢిల్లీ లో ఉండకపోవడం మంచిది అని వైద్యులు ఆమెకి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి.దీంతో ఆమె కొద్ది రోజుల పాటు చెన్నై లేదా గోవాకు వెళ్లనున్నారు. ఈ రోజు సాయంత్రంలోపే ఆమె ఢిల్లీని వీడనున్నారని.. ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలలో ఎవరో ఒకరు ఉంటారని పార్టీ వర్గాల సమాచారం.
కాగా, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినప్పటీ నుంచి సోనియా గాంధీ మందులు వాడుతూనే ఉన్నారు. ఛాతీ నొప్పి కారణంగా సోనియా గాంధీ జూలై 30న గంగారాం ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. ఇక ఆ తర్వాత డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచి సోనియా గాంధీ వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. అలాగే, రెగ్యులర్ చెకప్స్ కోసం సెప్టెంబర్ నెలలో విదేశాలకు కూడా వెళ్లారు. ఇక ఇప్పుడు ఢిల్లీలో వాయు కాలుష్యం తారస్థాయికి చేరిపోవడంతో ఉబ్బసం, ఛాతీ నొప్పి తీవ్రమయ్యే అవకాశాలు ఉండటంతో ఢిల్లీ నుండి కొద్దిరోజుల పాటు ఎక్కడికైనా వెళ్లి ఉంటే మంచిది అని సలహా ఇచ్చారు.
ఇక, సోనియా గాంధీ జూలై 30వ తేదీ సాయంత్రం అనారోగ్యంతో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత సెప్టెంబర్ 12న సాధారణ వైద్య పరీక్షలు కోసం ఆమె విదేశాలకు వెళ్లారు. ఆ పర్యటనలో ఆమెతో పాటు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.ఇక, గతేడాది జనవరిలో సోనియా గాంధీ కొన్ని రోజుల పాటు గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆమె సైక్లింగ్ చేసిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.