Begin typing your search above and press return to search.

రాహూల్ ను కన్నతల్లి సోనియానే తొక్కేసిందా?

By:  Tupaki Desk   |   11 March 2020 12:30 PM GMT
రాహూల్ ను కన్నతల్లి సోనియానే తొక్కేసిందా?
X
ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ స్వయం తప్పిదమేనని అందరికీ తెలుస్తోంది. మొదటి నుంచి విబేధాలను పట్టించుకోకపోవడం, సీనియర్ నాయకులంటూ యువతకు ప్రాధాన్యమివ్వకపోవడం తదితర వంటి అంశాలతో మధ్యప్రదేశ్ లో ప్రస్తుత పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ వ్యవహారమంతా అధిష్టానం నిర్లక్ష్య వైఖరి ప్రధాన కారణమని, ఇక మధ్యప్రదేశ్ పార్టీలో నెలకొన్న విబేధాలు, సీనియర్ల పెత్తందారీతనం వంటి కారణాల తో ప్రస్తుత పరిస్థితులు దారితీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నార. అయితే ఈ పరిణామాన్ని పార్టీ యువ నాయకుడు, సోనియా గాంధీ కుమారుడు రాహూల్ గాంధీ ముందే ఊహించినట్లు తెలుస్తోంది.

గతేడాది జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అధికారం లో ఉన్న బీజేపీ కన్నా అత్యధిక సీట్లు సొంతం చేసుకుని అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. రెండు, మూడు సీట్లు తక్కువ కావడం తో స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతు తో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే ఎన్నికల్లో కీలకంగా పని చేసిన జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రిగా చేయాలని అప్పట్లోనే రాహూల్ గాంధీ నిర్ణయించారంట. యువతకు ప్రాధాన్యం ఇద్దాం మమ్మీ అని చెప్పారంట. అయితే సీడబ్ల్యూసీ మాత్రం అంటే సోనియాగాంధీ మాత్రం సీనియర్ నాయకులకు అవకాశం ఇద్దామని నిర్ణయించారు. ఆ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు కమల్ నాథ్ ముఖ్యమంత్రి అయ్యాడు. దీంతో రాహూల్ గాంధీ నిరాశకు గురయ్యాడంట.

దీంతో పాటు ఆ సమయంలో రాజస్తాన్ లో సచిన్ పైలట్ ను ముఖ్యమంత్రిగా చేయాలని రాహూల్ సూచించారని సమాచారం. అక్కడ కూడా సచిన్ పైలెట్ ను కాదని అశోక్ గెహ్లాత్ ను ముఖ్యమంత్రిగా అధిష్టానం నిర్ణయించింది.

దీంతో పక్కపక్కన ఉండే రాష్ట్రాల్లో రాహూల్ కు మిత్రులుగా ఉండే యువ నాయకులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలెట్ నిరాశకు గురయ్యారు. తన తల్లి తన సలహాలను ఖాతరు చేయలేదని రాహూల్ కూడా మనస్తాపం చెందాడు. దీంతో ఆ క్రమంలోనే పార్టీ అధ్యక్ష పదవికి రాహూల్ రాజీనామా చేసినట్లు ఇప్పుడు తెలుస్తోంది. స్వయంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వకపోవడం, తను చెప్పిన సలహాలు పట్టించుకోకపోవడం వంటి వాటిని చూస్తుంటే పరోక్షంగా తన కుమారుడు రాహూల్ ను రాజకీయంగా సోనియాగాంధే తొక్కిసేనట్లు ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. అప్పట్లోనే గుజరాత్, మధ్యప్రదేశ్ లో సచిన్ పైలెట్, జ్యోతిరాదిత్య సింధియా కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చి ఉంటే ప్రస్తుత పరిణామాలు చోటుచేసుకుని ఉండేవి కాదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మొదలయ్యాయి.. త్వరలోనే గుజరాత్ లో కూడా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.