Begin typing your search above and press return to search.
సోనియమ్మ అందుకే ఫ్లాట్ అయిపోయారా?
By: Tupaki Desk | 7 Sep 2015 4:14 AM GMTదేశాన్ని రిమోట్ కంట్రోల్ లా ఆడించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సంబంధించిన పర్సనల్ విషయం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. పాక్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ కసూరి రాసిన తన తాజా పుస్తకం ‘‘నైదర్ ఏ హాక్ నార్ ఏ డవ్’’ రాశారు.
ఈ పుస్తకంలో ఆసక్తికర అంశాలు చాలానే ఉన్నా.. పలువురి దృష్టిని ఆకర్షిస్తున్న కొన్ని విషయాల్లో ఆయనతో కాంగ్రెస్ అధినేత్రి 2005 ప్రాంతంలో జరిపిన సరదా సంఘటనను ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు.
రాజీవ్ గాంధీలో ఏం చూసి సోనియాగాంధీ పెళ్లి చేసుకున్నారన్న విషయానికి ఆమే స్వయంగా తనతో చెప్పిన విషయాన్ని ఖుర్షీద్ రాసుకున్నారు. రాజీవ్ అందానికి తాను ప్లాట్ అయిపోయినట్లుగా తనతో జరిపిన సరదా సంభాషణలో చెప్పినట్లుగా ఆయన రాశారు.
తనతో సోనియా చెప్పిన మాటల్ని ఆయనిలా రాసుకున్నారు. ‘‘అప్పట్లో నేను కేంబ్రిడ్జ్ వర్సిటీలో చదువుతున్నా. నా ఎదురుగా అందమైన యువకుడు వెళుతున్నాడు. నా పక్కనే ఉన్న సోహైల్ ను అతనెవరని అడిగా. అతను పండిట్ నెహ్రూ మనవడు రాజీవ్ అని చెప్పారు. దీంతో ఆయన్ను నేను చిరునవ్వుతో పలుకరించా’’ అని సోనియా చెప్పినట్లుగా ఆయన తన పుస్తకంలో రాసుకున్నారు. ఇంతకీ ఈ సొహైల్ ఎవరంటే.. కాంగ్రెస్ నేత ఇఫ్తికరుద్దీన్ కుమారుడు. అలా అందగాడైనందునే రాజీవ్ ను తాను పెళ్లాడినట్లుగా ఆయనతో ఆమె చెప్పినట్లుగా పుస్తకంలో రాసేశారు.
మొత్తానికి సోనియమ్మలో రాజీవ్ అందం కదలిక తెచ్చినట్లుగా కనిపించినప్పటికీ.. జాగ్రత్తగా గమనిస్తే మరో కోణం కూడా కనిపించక మానదు. అతను ఎవరని అడిగినప్పుడు రాజీవ్ పేరు చెప్పకుండా.. పండిట్ నెహ్రూ మనమడు అని సొహైల్ చెప్పటం మర్చిపోకూడదు. మరి.. సోనియమ్మ ఫ్లాట్ అయ్యింది రాజీవ్ అందంతో పాటు.. పండిట్ నెహ్రూ మనమడన్న మాటకు కూడానా.. అన్న మాట మనసులోకి రాకుండా పోదు. అవును కదూ.