Begin typing your search above and press return to search.

సోనియా సంచలనం.. 16న కాంగ్రెస్ లో ఏం జరగబోతోంది?

By:  Tupaki Desk   |   15 Nov 2019 6:06 AM GMT
సోనియా సంచలనం.. 16న కాంగ్రెస్ లో ఏం జరగబోతోంది?
X
బీజేపీ దూకుడైన నిర్ణయాలు.. సుప్రీం కోర్టు కీలక తీర్పులు.. రోజు రోజుకు కునారిల్లుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని అధినేత్రి సోనియా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర లో కనీసం ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలన్నీ సీట్లు కూడా దక్కని కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా భావిస్తున్నట్టు తెలిసింది. మహా రాష్ట్ర లో 5 ఏళ్ల కిందట వరకు రెండు సార్లు వరుసగా అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాలుగో స్థానానికి పడి పోవడంపై పోస్టు మార్టం మొదలైంది. ఇక దేశ వ్యాప్తంగా వచ్చే ఐదేళ్ల లో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి.. అధికారం లోకి తీసుకు రావడానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా నడుం బిగించినట్టు తెలిసింది. అందులో భాగంగా అన్ని రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, సీఎల్పీ, వర్కింగ్ ప్రెసిడెంట్స్ లను ఈనెల 16న ఢిల్లీ కి రావాలని కాంగ్రెస్ అధిష్టానం కబురు పంపింది.

*పీసీసీ ల ప్రక్షాళన..
అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ బాధ్యులను 16న ఢిల్లీకి రావడానికి ప్రధాన కారణం పార్టీ ప్రక్షాళ నే అన్న చర్చ సాగుతోంది. ఎప్పుడో ఆరేడేళ్ల కిందట భర్తీ అయిన పీసీసీ పదవుల ను సమూలం గా మార్చేసి కొత్త వారు.. యువత ను అట్రాక్ట్ చేసే వారు.. ప్రజల్లో ఫాలోయింగ్ ఉన్న యువనేతలకు కట్టబెట్టాలని సోనియా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా కొత్త పీసీసీ చీఫ్ లను నియమించడానికే సోనియా ఈ పిలుపునిచ్చిందని ప్రక్షాళన ఖాయమని పార్టీ నేతలు భావిస్తున్నారు.

*నాలుగేళ్ల లో అధికారం దిశగా..
మోడీ సర్కారు ఏర్పడి 6 నెలలు గడిచి పోయింది.. మరో నాలుగున్నర ఏళ్ల లో పార్టీని అధికారం లోకి తీసుకు రావడమే టార్గెట్ గా సోనియా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీలో ప్రక్షాళన చేసి పూర్తిగా వ్యవస్థీకరించాలని చూస్తున్నారు. పార్టీల్లోని విభేదాలను పక్కనపెట్టి నేతల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతున్నారు.

*అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ పీసీసీ లో మార్పులు
అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ ను కూడా మార్చడానికి సోనియా రెడీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ పీసీసీ చీఫ్ రేసు లో అందరికంటే ముందున్నారు రేవంత్ రెడ్డి. కానీ ఆయన టీడీపీ నుంచి వలస వచ్చిన కారణం గా కాంగ్రెస్ సీనియర్లు ఒప్పుకోవడం లేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రజాదరణ, ఫాలోయింగ్, దూకుడు, కేసీఆర్ ను ఢీకొట్టే నేత కావడం తో అన్ని పక్కన పెట్టేసి కాంగ్రెస్ పగ్గాలు అప్పజెప్పేందుకు సోనియా నిర్ణయించినట్టు సమాచారం. అసంతృప్త నేతల కు సైతం కీలక పదవులు ఇచ్చేందుకు సోనియా రెడీ అయ్యిందట.. పార్టీలో కుమ్ములాటల కంటే పార్టీని విజయ తీరాలకు చేర్చే నేతలు ఎవరైనా సరే వారికే పీసీసీ చీఫ్ పదవులు ఇవ్వానికి సోనియా రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ లెక్కన రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ చీఫ్ గా చేయడం ఖాయమన్న ప్రచారం సాగుతోంది.