Begin typing your search above and press return to search.
డ్రగ్స్ రాకెట్ లో బడాబాబుల పుత్ర రత్నాలు!
By: Tupaki Desk | 21 July 2017 1:01 PM GMTహైదరాబాద్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ రాకెట్ లో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. డ్రగ్స్ వ్యవహారంలో కొంతమంది బడా బాబుల పుత్రరత్నాలు నలుగురు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ రాకెట్ సూత్రధారి కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆ నలుగురు విద్యార్థులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. కెల్విన్ క్రియేట్ చేసిన డార్క్‌నెట్ వెబ్ సైట్ ద్వారా వీరు నేరుగా తమ ఇళ్లకే డ్రగ్స్ తెప్పించుకున్నట్లు తెలిసింది.
ఆ నలుగురు విద్యార్థులు ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివినట్టు తెలుస్తోంది. కెల్విన్‌తో వీరికి సన్నిహిత సంబంధాలున్నట్టు సమాచారం. వీరికి తరచుగా డ్రగ్స్ సరఫరా చేసినట్టు కెల్విన్ విచారణలో తెలిపినట్లు వినికిడి. ఆ నలుగురు ఐఏఎస్ అధికారి - డాక్టర్ - ఓ ప్రముఖ కంపెనీ డైరెక్టర్ - సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కుమారులుగా గుర్తించారు.
కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఆ నలుగురికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులు, పోలీసులు అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్‌లో చాలా మంది విద్యార్థులు కెల్విన్‌కు రెగ్యులర్ కస్టమర్లుగా ఉన్నట్టు తెలిసింది. ఈ రోజు నటుడు సుబ్బరాజును సిట్ అధికారులు విచారిస్తున్న సంగతి తెలిసిందే.