Begin typing your search above and press return to search.
పిలవని పెళ్లికి వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చిన ప్రముఖ సింగర్
By: Tupaki Desk | 17 Dec 2021 4:51 AM GMTపిలవని పేరంటానికి వెళ్లినట్లు చెప్పే సామెత తరహాలో వ్యవహరించారు ప్రముఖ సింగర్ ఒకరు. అయితే.. సామెత అర్థానికి.. తాజాగా జరిగింది మాత్రం భిన్నమని చెప్పాలి. ఇంతకీ ఆ ప్రముఖ సింగర్ ఎవరు? పిలవని పెళ్లికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? వెళ్లిన తర్వాత ఏమైంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు ఆసక్తికరంగా మారాయి. ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
సొంత పని మీద ఉజ్జయిని వెళ్లిన ఆయన ఒక హోటల్ లో బస చేశార. తాను వెళ్లిన ఉజ్జయినిలో అమ్మవారి గుడిని సందర్శించి తిరిగి హోటల్ కు వచ్చారు. అయితే.. ఆయన బస చేసిన హోటల్ లో పెళ్లి జరుగుతోంది. ఆయనకు ఆ పెళ్లికి ఎలాంటి ఆహ్వానం లేకున్నా.. ఆయన ఆ పెళ్లికి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అంతే.. మండపంలోకి అడుగు పెట్టిన ఆయన్ను చూసిన వారంతా ఒక్కసారిగా సర్ ప్రైజ్ అయ్యారు.
ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. సోనూ నిగమ్ పెళ్లి మండపంలోకి వెళ్లే సమయానికి.. అక్కడ అప్పగింతల కార్యక్రమం జరుగుతోంది. పెళ్లి వేడుక చివర్లో ఉండే ఈ భారమైన ఎపిసోడ్.. తీవ్రమైన భావోద్వేగానికి గురి చేస్తుంది. అలాంటి పరిస్థితుల్లోనే సోనూ నిగమ్ పెళ్లి మండపంలోకి ఎంట్రీ ఇవ్వటం.. నేరుగా పెళ్లి పీటల మీద ఉన్న నూతన వధూవరుల వద్దకు వెళ్లి.. వారిని ఆశీర్వదించారు.
అప్పటివరకు తీవ్రమైన భావోద్వేగంతో ఉన్న అక్కడి గంభీర వాతావరణం సింగర్ సోనూ పుణ్యమా అని ఒక్కసారిగా మారిపోయింది.ఒక ప్రముఖ సింగర్ పిలవకున్నా.. తమ పెళ్లికి వచ్చిన కొత్త జంటను ఆశీర్దించటం అక్కడి వారిని ఆనందానికి గురి చేయటమే కాదు.. మర్చిపోలేని తీపి గురుతుగా మార్చారు.