Begin typing your search above and press return to search.
సోనూ సూద్ సంచలనం.. మిస్డ్ కాల్ ఇస్తే ఇంటికే ఆక్సీజన్!
By: Tupaki Desk | 16 May 2021 2:30 AM GMTతొలి దశలో కరోనా మహమ్మారి దేశాన్ని చుట్టుముట్టేనాటికి సోనూ సూద్ అందరు సినీ నటులలో ఒకరు. కానీ.. ఇప్పుడు దేశంలోనే ప్రత్యేకమైన వ్యక్తి. రియల్ హీరో. నేషనల్ ఐకాన్. ఇలా ఎన్నో బిరుదులు అతడి సొంతం.
మొదటి వేవ్ లో ఎంతో మంది అభాగ్యులకు ఆపన్న హస్తం అందించిన సోనూ సూద్.. ఆ తర్వాత నుంచి చేతికి ఎముక లేదన్న చందంగా అడిగిన వారికల్లా సహాయం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు సెకండ్ తారస్థాయికి చేరి, మారణహోమం సృష్టిస్తున్న వేళ.. ఆపదలో ఉన్నవారికి తానున్నా అంటూ అండగా నిలబడుతున్నారు.
సుమారు నాలుగు వందల మందితో దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని, ఎక్కడి నుంచి సహాయం కావాలని పిలుపు అందినా.. వెంటనే వాలిపోతున్నాడు. అయితే.. ఇప్పుడు ఢిల్లీలో ఆక్సీజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఊపిరి అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు అండగా నిలవడానికి సిద్ధమయ్యాడు.
ఆక్సీజన్ అవసరమైన వారికి ఏకంగా.. ఇంటికే డెలివరీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఢిల్లీ వాసులకు ఎవరికైనా ఆక్సీజన్ కావాల్సి వస్తే.. 022-61403615 నంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాలని సూచిస్తున్నాడు. అలాంటి వారికి ఏకంగా ఆక్సీజన్ కాన్సన్ ట్రేటర్ ను ఇంటికే పంపిస్తానని ప్రకటించాడు సోనూ. దీంతో ఎంతో మంది సోనూను అభినందిస్తున్నారు.