Begin typing your search above and press return to search.
అంబానీ గూబగుయ్ మనిపించిన సోనుసూద్..!
By: Tupaki Desk | 11 Oct 2020 12:10 PM GMTసోనూ సూద్.. లాక్ డౌన్ లో దేశంలోని ఎంతో మంది పేద - మధ్యతరగతి వాళ్లను ఆదుకున్నారు. కేంద్ర - రాష్ట్రాల ప్రభుత్వాలు చేష్టలుడి చూస్తున్న వేళ సోనూ సూద్ నేనున్నాని ముందుకొచ్చారు. తన సొంత డబ్బులు వెచ్చించి ఎంతోమందిని ఆదుకున్నాడు. వలస కార్మికులను తమ సొంతూళ్లకు తరలించేందుకు సోనూసుద్ తన సొంత డబ్బులతో బస్సులను ఏర్పాటు చేశాడు. కొందరినిలో రైళ్లలో తన డబ్బులతో పంపించి రియల్ హీరో అనిపించాడు. అంతేకాకుండా తన దృష్టికి వచ్చిన ప్రతీ సమస్యను పరిష్కరిస్తూ అతడే మినీ ప్రభుత్వంలా మారిపోయాడు. దీంతో సోనూసుద్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.
తాజాగా సోనూసుద్ సోషల్ మీడియాలో భారత కుబేరుడు ముకేష్ అంబానీ గూబగుయ్ మనేలా అదిరిపోయే పంచ్ ఇచ్చాడు. కరోనా టైంలో కేంద్రం తీసుకొచ్చిన పాలసీలు పేదల కంటే కార్పొరేట్ కంపెనీలకే మేలు చేశాయనే అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ తరుణంలో సోనూసుద్ ట్వీట్ మరోసారి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను తెరపైకి తీసుకొచ్చింది. కరోనా సమయంలో కేంద్రం తీసుకొచ్చిన వేలకోట్ల ఉద్దీపాన ప్యాకేజీతో పేదలకు ఒరిగిందేమీ లేదని అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
ముకేష్ అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు అయినప్పటికీ కరోనా సమయంలో పేదల కోసం ఒకపైసా ఇచ్చిన పాపానా పోలేదు. ఈ నేపథ్యంలో సోనూసుద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
కరోనా సమయంలో అంబానీ ఆస్తులు 22 బిలియన్ల మేరకు వృద్ధి ఆయన సంపద 79.3 బిలియన్లకు చేరింది. కరోనా టైంలో జియో సంస్థలోకి పెట్టుబడులు వరదలా వచ్చి చేరాయి. ఈ నేపథ్యంలోనే సోనూ సూద్ తాజాగా అంబానీ లాంటి కుబేరులకు గట్టిగా తగిలేలా ట్విట్టర్లో పంచ్ వేశాడు. కరోనా.. లాక్ డౌన్ సమయంలో ధనవంతులు మరింత ధనవంతులుగా మారారని.. పేదవాళ్లు మరింత పేదవాళ్లు అయ్యారని సోనూసుద్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. దీనికి నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది.