Begin typing your search above and press return to search.
యాక్టర్లనే కాదు పొలిటీషియన్లను వదలట్లేదు!
By: Tupaki Desk | 4 March 2017 5:59 AM GMTదేశ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ముంబైలో మృగాళ్ల వేధింపులు నానాటికీ పెరిగిపోతున్నాయి. దేశ వాణిజ్యానికే కాకుండా బాలీవుడ్ కు కూడా కేపిటల్ గా ఉన్న ముంబైలో పోలీసింగ్ కాస్తంత ఎక్కువే. అయినా కూడా అక్కడ మహిళలపై వేధింపుల పర్వానికి అడ్డుకట్ట పడటం లేదు. అంతేకాదండోయ్ అక్కడి అన్ని రంగాలకు చెందిన మహిళలకు కూడా ఈ తరహా వేధింపులు తప్పడం లేదు. ప్రముఖ జాబితాలోని వారిని కూడా వేధింపురాయుళ్లు విడిచిపెట్టడం లేదు. వేధింపులకు పాల్పడితే... కఠిన శిక్షలు తప్పవన్న భయం మృగాళ్లలో ఏ కోశానా కనిపించడం లేదన్న వాదన కూడా వినిపిస్తోంది. తాజాగా అక్కడ చోటుచేసుకున్న రెండు ఘటనలను చూస్తే... ఈ మాటలన్నీ నిజమేనని ఒప్పుకోక తప్పదు.
ఇటీవల అక్కడి పోలీసులకు అందిన రెండు ఫిర్యాదులను పరిశీలిస్తే... నగరానికి చెందిన ఇద్దరు ప్రముఖ మహిళలు తమకు వేధింపులు ఎదురవుతున్నాయని కంప్లైంట్ చేశారు. వీరిలో ఒకరు బాలీవుడ్ నటి కాగా.. మరొకరు ప్రముఖ రాజకీయ నాయకురాలు. నటి వేధింపుల పర్వానికొస్తే... బాలీవుడ్‌లో అలనాటి కలల రాణి సోనూ వాలియాను గుర్తు తెలియని వ్యక్తి కొంతకాలంగా ఫోన్ లో వేధిస్తున్నాడు. దీనిపై ఆమె ముంబైలోని బంగూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఐపీసీ సెక్షన్ 354 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఖూన్ - భరీ మాంగ్ లాంటి చిత్రాల్లో హాట్ గా నటించిన సోను వాలియా (53) ప్రస్తుతం ముంబైలోని మలాడ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. తనకు ఫోన్ చేసిన వ్యక్తి అసభ్యంగా మాట్లాడటంతో పాటు అసభ్య వీడియోలు కూడా పంపుతున్నాడని వాలియా పోలీసులకు తెలిపారు. దాదాపు వారం రోజుల నుంచి కొనసాగుతున్న ఈ వేధింపులు ఏమాత్రం తగ్గకపోవడంతో ఇక పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. అతడిని తాను హెచ్చరించినా ఫలితం కనిపించలేదని, పైపెచ్చు అసభ్య ఫోన్ కాల్స్ మరింత పెరిగాయని అన్నారు.
ఇక వేధింపులకు గురైన పొలిటీషియన్ విషయానికి వస్తే... ముంబై నగరానికే చెందిన ప్రముఖ బీజేపీ నాయకురాలు షైనా ఎన్ సీకి కూడా వేధింపులు తప్పలేదు. తనకు ఒక వ్యక్తి అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఫ్యాషన్ డిజైనర్ గానూ రాణిస్తున్న షైనా.. తనకు గత డిసెంబర్ నెల నుంచి ఆ వ్యక్తి వాట్సప్ - ఎస్ ఎంఎస్ ల ద్వారా అసభ్య సందేశాలు పంపుతున్నాడని, అతడి వేధింపులు భరించలేక చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. ముంబై బీకేసీలోని సైబర్ క్రైం విభాగంలో ఆమె ఫిర్యాదు దాఖలు చేశారు. బీఎంసీ ఎన్నికల ప్రచారంలో బాగా బిజీగా ఉండటంతో ఇన్నాళ్ల పాటు పోలీసుల వద్దకు వెళ్లలేదన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/