Begin typing your search above and press return to search.
ఆ రెండు తోపు చానళ్ల విలీన డీల్ లో మరో అడుగుపడింది
By: Tupaki Desk | 23 Dec 2021 4:55 AM GMTరెండు బడా వినోద చానళ్ల మధ్య నడుస్తున్న విలీన ఒప్పందం మరో కీలక అడుగు పడింది. వినోద చానళ్లుగా మంచి పేరున్న సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియాలో మరో తోపు ఎంటరట్మైనెంట్ చానళ్ల సముదాయమైన జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజెస్ (జీల్) విలీన ఎపిసోడ్ కు సంబంధించి మరో ముఖ్యమైన పరిణామం పూర్తైంది. విలీనంలో కీలకమైన విలువ మదింపునకు సంబంధించి చర్చల గడువు ముగిసింది.
తాజాగానెట్ వర్క్ లు.. డిజిటల్ ఆస్తులు.. నిర్మాణ కార్యకలాపాలు.. ప్రోగ్రాం లైబ్రరీలు మొదలైన వాటిని విలీనం చేసేందుకు ఇరు సంస్థలు తాజాగా ఒప్పందాలు చేసుకోవటంతో పాటు.. అందుకు అవసరమైన పేపర్ వర్కును పూర్తి చేశాయి. సంయుక్తంగా సంతకాలు పూర్తి చేశాయి. సోనీ చానళ్ల సముదాయంలోకి జీ విలీన డీల్ సెప్టెంబరులో జరిగిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం సోనీ పిక్చర్స్ ఎంటర్ టైన్ మెంట్ 1.575 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది.
ఇందుకు ప్రతిగా 50.86 శాతం వాటాల్ని దక్కించుకోనుంది. జీలో జీల్ ప్రమోటర్లకు 3.99 శాతం వాటా ఉండగా.. 45.15 శాతం వాటాల్ని జీల్ షేర్ హోలర్డర్లకు ఉన్నాయి. ఈ డీల్ పూర్తి చేసిన తర్వాత విలీన సంస్థను స్టాక్ ఎక్సైంజ్ లో లిస్టు చేస్తారు. తాజాగా రెండు సంస్థలు ఒక ప్రకటనను విడుదల చేశాయి. అందులో పేర్కొన్న ముఖ్యాంశాల్ని చూస్తే..
- జీల్ సీఈవో పునీత్ గోయెంకా ఎండీగా.. సీఈవోగా కొనసాగుతారు.
- భారత వినియోగదారులకు మెరుగైన వినోదాన్ని ఇవ్వటం కోసం మీడియా రంగంలో అత్యంత పటిష్టమైన రెండు టీంలను ఒకే తాటి మీదకు తీసుకొస్తున్నాం.
- కంటెంట్ క్రియేటర్లు.. ఫిలిమ్ టైబ్రరీలను ఒక తాటి మీదకు తీసుకొచ్చే దిశగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఇదో కీలకమైన అడుగు.
- వినియోగదారులకు విస్తృత స్థాయిలో కంటెంట్ అందించేందుకు తమ తాజా డీల్ దోహదం చేస్తుంది.