Begin typing your search above and press return to search.
తొందరలోనే వైజాగ్ లో పరిపాలనా రాజధాని
By: Tupaki Desk | 13 Feb 2021 3:30 AM GMTప్రభుత్వంలో మొదలైన తాజా పరిణామాలు చూస్తుంటే పరిపాలనా రాజధాని వైజాగ్ కు తరలి వెళ్ళిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. అమరావతిలో శాసనరాజధానికి కావాల్సి భవనాలేమిటో వెంటనే తేల్చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఒక ఉన్నతస్ధాయి కమిటి ఏర్పడింది. టీడీపీ హయాంలో అమరావతి ప్రాంతంలో శాసనసభ్యులకు క్వార్టర్స్, అఖిల భారత సర్వీసు అధికారులకు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ తో పాటు అనేక అపార్ట్ మెంట్లు నిర్మాణాలు మొదలయ్యాయి.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే ఈ నిర్మాణాలన్నీ దాదాపు ఆగిపోయాయి. దాంతో వాటిని ప్రభుత్వం ఏమి చేయబోతోందనే విషయంలో అయోమయం పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చిన తర్వాత విషయం అర్ధమవటంతో భవనాల సంగతిని జనాలు పట్టించుకోవటమే మానేశారు. మూడు రాజధానుల ప్రతిపాదన అనేక సాంకేతిక కారణాలతో కోర్టు విచారణను ఎదుర్కొంటోంది. దాంతో మూడు రాజధానుల ప్రతిపాదనలో పురోగతి ఏమిటో ఎవరీకీ తెలీదు.
ఇలాంటి నేపధ్యంలోనే శాసనరాజధానికి కావాల్సిన భవనాలను తేల్చటానికి ప్రభుత్వం ఉన్నతస్ధాయి కమిటిని నియమించింది. దీంతో తొందరలోనే పరిపాలనా రాజధాని వైజాగ్ కు తరలివెళ్ళిపోవటం ఖాయమనే సంకేతాలు బలంగా కనబడుతున్నాయి. రాజధానుల ఏర్పాటు విషయంలో తమ పాత్ర ఏమీ లేదని కేంద్రప్రభుత్వం ఎప్పుడో తేల్చేసింది. తాజాగా హైకోర్టును కర్నూలుకు తరలించే విషయంలో న్యాయవ్యవస్ధ-ప్రభుత్వమే తేల్చుకోవాలని కేంద్రం పార్లమెంటులోనే ప్రకటించింది.
దీంతో తెరవెనుక ప్రయత్నాలు ఏమైనా మొదలయ్యాయో ఏమో తెలీటం లేదు. కానీ శాసనరాజధానికి అవసరమైన భవనాలను గుర్తించన వెంటనే మిగిలిన పనులు చకచక జరిగిపోతాయని అర్ధమవుతోంది. ఎందుకంటే ఇపుడున్న అసెంబ్లీ భవనం తాత్కాలికమే. కాబట్టి ఎంఎల్ఏల క్వార్టర్స్ తో పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం.
అవసరమైన భవనాలను గుర్తింపు జరగ్గానే పరిపాలనా రాజధానిని వైజాగ్ తీసుకెళిపోవాలన్నది జగన్ ఆలోచనగా కనబడుతోంది. పనిలో పనిగా హైకోర్టును కర్నూలుకు తరలింపు విషయంలో కూడా ప్రభుత్వం తరపున చర్చలు మొదలైనట్లు అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. కాబట్టి పరిస్ధితులు అనుకూలిస్తే వీలైనంత తొందరలోనే వైజాగ్ వెళ్ళిపోవటం ఖాయమని తేలిపోతోంది.