Begin typing your search above and press return to search.
రజనీ మద్దతు బీజేపీకే:సౌందర రాజన్
By: Tupaki Desk | 1 Jan 2018 5:10 PM GMTతమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై కొంతకాలంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ ....ఆ సస్పెన్స్ కు తెరదించుతూ తాను రాజకీయాల్లోకి వచ్చేశానని ప్రకటించి అభిమానులకు నూతన సంవత్సర కానుకనిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రజనీ `రాజకీయ చదరంగంలో అడుగుపెట్టి 24 గంటలు గడవక ముందే ప్రత్యర్థులు పావులు కదపడం మొదలెట్టారు. బీజేపీతో రజనీ జతకట్టబోతున్నారని - మోదీకి ఆయన సన్నిహితుడని....డీఎంకే నర్మగర్భ ప్రకటనలు చేస్తే బీజేపీ - మోదీలపై తమిళ ప్రజలకున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా రజనీకాంత్ తమవాడేనని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.
సమయం వచ్చినప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని - అప్పటివరకు తనతో సహా ఎవరూ తొందరపడి ఎటువంటి ప్రకటనలు చేయవద్దని - ఎవరిపై విమర్శలు గుప్పించవద్దని తలైవా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేసే అవకాశముందని రజనీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రజనీ....2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తారా లేక రాబోయే లోక్ సభ ఎన్నికల బరిలో నిలుస్తారా? అన్న విషయంపై స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ....పొత్తులపై - మిత్రపక్షాలపై రజనీ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడక ముందే బీజేపీ ఓ అడుగు ముందుకేసింది. 2019 లో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికల్లో ....తలైవా పార్టీ ....ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటుందని తమిళనాడు బీజేపీ చీఫ్ టీ సౌందరరాజన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతిని అంతమొందించడం - సుపరిపాలనే తమ పార్టీ - రజనీ ల లక్ష్యమని - రజనీ రాజకీయ ప్రవేశాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. గతంలో ప్రధాని నరేంద్ర మోడీని రజనీకాంత్ కలవడం - గత నెలలో తమిళనాడులో మరోసారి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చాలాకాలం నుంచి బీజేపీ-రజనీ దోస్తీ పై రకరకాల ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా, రజనీ ప్రకటన నేపథ్యంలో.....బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా స్పందించారు. రజనీ రాజకీయాల్లోకి రావడం ఆనందకరమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయబోతున్నామని - రజనీ సినిమాల్లో సూపర్ స్టార్ అని - మోడీ జాతీయ రాజకీయాల్లో సూపర్ స్టార్ అని బీజేపీ నేత జీవీఎల్ నర్సింహా రావు గతంలో వ్యాఖ్యానించారు. కమల్ ...తనతో కలిసి పనిచేయాల్సిందిగా ఇచ్చిన ఆహ్వానాన్ని రజనీ సున్నితంగా తిరస్కరించిన సంగతి తెలిసిందే. బీజేపీపై కమల్ తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో రజనీ కమలం వైపు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పొలిటికల్ థ్రిల్లర్ ను తలపిస్తోన్న తమిళ రాజకీయాలలో తలైవా రాకతో కాక పుట్టిందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో తమిళనాట రాజకీయ చదరంగంలో కమల్ - రజనీలు కీలకమైన పాత్రలు పోషించబోతున్నారు. మరోవైపు మన్నార్ గుడి మాఫియా - అన్నాడీఎంకే వర్గాలు - డీఎంకే....ఇలా తమిళనాడులో పంచముఖ పోరు తప్పేలా లేదు. అత్యంత సున్నితమైన తమిళ ఓటర్లు....ఆ పోరులో ఎవరికి జై కొడతారో అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న!