Begin typing your search above and press return to search.
బిగ్ బీని అంత బద్నాం చేస్తారా?
By: Tupaki Desk | 21 March 2016 9:43 AM GMTసోషల్ మీడియా అందరికి అందుబాటులోకి వచ్చాక మంచి ఎంత జరిగిందో.. చెడు కూడా అంతే పెరిగింది. ఎవరికి ఎలాంటి అవసరమో దానికి తగ్గట్లుగానే సోషల్ మీడియాను వాడేస్తున్నారు. మంచి కానీ చెడు కానీ.. విషయం ఏదైనా కానీ వైరల్ కావటం.. అందరి దగ్గరికి వెళ్లేలా చేయటంలో సోషల్ మీడియా కీలక భూమిక పోషిస్తోంది. తాజాగా బిగ్ బి అమితాబ్ మీద దారుణమైన నిందను మోపి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
మొన్న ఈడెన్ గార్డెన్ లో జరిగి భారత్.. పాక్ మ్యాచ్ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించేందుకు అమితాబ్ ప్రత్యేకంగా రావటం.. పాడటం జరిగిపోయింది. అయితే.. ఆయనీ పని కోసం రూ.5కోట్లు వసూలు చేశారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తలకమాసిన వెబ్ సైట్ కథనాన్ని జోరుగా ప్రచారం చేయటం.. ఇందుకోసం సోషల్ మీడియాను పావుగా మార్చుకున్న వారు.. అమితాబ్ ను బద్నాం చేసేందుకు నడుం బిగించాయి.
చాప కింద నీరులా మొదలైన ఈ ప్రచారానికి సంబంధించిన విషయాలు ప్రముఖ క్రికెటర్.. మాజీ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన సారభ్ గంగూలీ తీవ్రంగా ఖండించారు. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని.. నిజం చెప్పాలంటే.. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన బిగ్ బి తన విమాన ఖర్చులతోపాటు.. హోటల్ కు కూడా ఆయన డబ్బులే వినియోగించారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమం కోసం కోల్ కతాకు వచ్చిన అమితాబ్ కు రూ.30లక్షలు ఖర్చు అయినట్లు సౌరబ్ చెప్పుకొచ్చారు. జాతీయ గీతం పాడినందుకు డబ్బులు తీసుకోవాలని ఆఫర్ చేసినా ఆయన ససేమిరా అన్నారని స్పష్టత ఇచ్చారు. నిజం ఇలా ఉంటే.. అమితాబ్ లాంటి వ్యక్తిని బద్నాం చేయటానికి దుష్టశక్తులు రంగంలోకి దిగి దారుణ ప్రచారానికి పూనుకోవటం గమనార్హం.