Begin typing your search above and press return to search.
సంధి వేళలో సమయాన్ని సవరించారు!
By: Tupaki Desk | 30 April 2018 3:30 PM GMTతమ చిరకాల ప్రత్యర్థి అయిన పొరుగు దేశం దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాన్ ఉంగ్ స్నేహ హస్తం అందించిన సంగతి తెలిసిందే. దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ కు కిమ్ చరిత్రాత్మక కరచాలనం చేసిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉత్తర, దక్షిణ కొరియా అధ్యక్షుల షేక్ హ్యాండ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా ఇరుదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను మెరుగుపరిచేందుకు ఇరు దేశాధ్యక్షులు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య అరగంట సమయం తేడా ఉన్న నేపథ్యంలో ఉత్తర కొరియా సమయాన్ని 30 నిమిషాలపాటు వెనకకు జరపాలని కిమ్ ఆల్రెడీ నిర్ణయించారు. తాజాగా, నేడు ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన భారీ మైకులను తొలగిస్తామని మూన్ జే ఇన్ ప్రకటించి సంచలనం రేపారు.
వాస్తవానికి మొదటి నుంచి జపాన్ ,దక్షిణ కొరియాలది ఒకే టైమ్‌జోన్. అయితే, జపాన్ నుంచి విముక్తి పొందిన 70 వార్షికోత్సవం సందర్భంగా 2015లో ఉత్తరకొరియా తన టైమ్ జోన్ ను మార్చుకుంది. అయితే, తాజాగా మళ్లీ పాత సమయానికి వచ్చేందుకు అంగీకరించింది. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సమయంలో అరగంట వ్యత్యాసం ఉంది. దక్షిణ కొరియా కన్నా ఉత్తర కొరియా గడియారం అరగంట ఆలస్యంగా నడుస్తోంది. అయితే, ఈ తేడాను మే 5వ తేదీ నుంచి సవరిస్తామని కిమ్ ఆల్రెడీ ప్రకటించారు. దానికి ప్రతిగా ప్రచార ఆర్భాటం కోసం ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన భారీ మైకులను దక్షిణ కొరియా తొలగించనుంది. శుక్రవారం నాడు కిమ్, మూన్ ల మధ్య జరిగిన శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఉత్తర కొరియా సరిహద్దుల్లోని మైకులను దక్షిణ కొరియా ఆఫ్ చేసింది. అయితే, మంగళవారం నుంచి వాటిని పూర్తిగా తీసి వేస్తున్నామని నేడు ప్రకటించింది. కాగా, 1953-54ల మధ్య కొరియా యుద్ధం తర్వాత దక్షిణ కొరియాలో అడుగుపెట్టిన తొలి ఉత్తరకొరియా అధ్యక్షుడిగా కిమ్ చరిత్రపుటలకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చరిత్రాత్మక ఘట్టానికి జ్ఞాపకంగా ఇరు దేశాధ్యక్షులు ఓ మొక్కను కూడా నాటారు. 1953-54ల మధ్య యుద్ధం శాంతియుత ఒప్పందంతో ముగియకపోవడంతో ఆ విషయంపై కిమ్, మూన్ లు చర్చించి ఇరు దేశాల మధ్య శాంతిని పెంపొందించేందుకు ఒప్పందం చేసుకోనున్నారని తెలుస్తోంది.