Begin typing your search above and press return to search.

కోవిడ్ తో ఉత్తరకొరియా నియంత పరిస్థితి విషమం?

By:  Tupaki Desk   |   11 Aug 2022 3:46 PM GMT
కోవిడ్ తో ఉత్తరకొరియా నియంత పరిస్థితి విషమం?
X
ఉత్తరకొరియా నియంత.. కరుడుగట్టిన కిమ్ జాంగ్ ఉన్ ను ఆ కరోనా ఆగమాగం చేస్తోంది. ఇప్పటికే లావుగా ఉండి.. తీవ్ర అనారోగ్య సమస్యలున్న కిమ్ కు కరోనా సోకినట్టు తెలిసింది. దీంతో ఆయన పరిస్థితి మరింత విషమించించినట్టు తెలుస్తోంది.

కోవిడ్ మహమ్మారి సమయంలో నార్త్ కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ జ్వరంతో బాధపడినట్లు ఆయన చెల్లెలు ప్రకటించారు. ఆయనకు వైరస్ సోకినట్లు చెబుతున్నారు. రోజుల వ్యవధిలోనే కోరియాలో లక్షల మంది ప్రజలు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యారట.. ఈ విషయాన్ని ఆయన సోదరి కిమ్ యో జోంగ్ తెలిపారు.

కిమ్ అనారోగ్యం గురించి ఆయన సోదరి ఓ ప్రసంగంలో చెప్పింది. జ్వరం కారణంగా తన సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని కిమ్ యో జోంగ్ తెలిపారు. కానీ, ప్రజల పట్ల ఆయనకున్న ఆందోళనల కారణంగా ఒక్క క్షణం కూడా ఆయన విశ్రాంతి తీసుకోలేదన్నారు.

కిమ్ ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యారన్న విషయాన్ని మాత్రం ఆమె వెల్లడించలేదు. ఈ సందర్భంగా దక్షిణకొరియాపై కిమ్ యో జోంగ్ తీవ్ర స్తాయిలో విరుచుకుపడ్డారు.

ఎప్పుడూ యుద్ధకాంక్షతో.. అనూహ్య నిర్ణయాలతో వార్తల్లో నిలిచే ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కరోనా బారినపడడం దేశంలో కలకలం రేపుతోంది. ఆయన అరోగ్యంపై అందరూ ఆరాతీస్తున్నారు.