Begin typing your search above and press return to search.

తిరగబడుతున్న కరోనా.. 91మంది మళ్లీ వైరస్

By:  Tupaki Desk   |   12 April 2020 4:15 AM GMT
తిరగబడుతున్న కరోనా.. 91మంది మళ్లీ వైరస్
X
కరోనా మహమ్మారి అంత తేలికగా మనిషిని వదలడం లేదు. కరోనా వ్యాధిని జయించి కోలుకున్న వారికి మళ్లీ తిరగబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయాందోళనకు గురిచేస్తోంది.

తాజాగా దక్షిణ కొరియాలో కరోనా వైరస్ తో పోరాడి కోలుకున్న వారిలో మళ్లీ ఆ వైరస్ తిరగబడడం సంచలనంగా మారింది. దక్షిణకోరియాలో ఇలాంటి 91మందికి వ్యాధి మళ్లీ వచ్చినట్లుగా కేసులు తాజాగా నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ 91మందిలో ఎవరికి కరోనా వైరస్ రెండోసారి సోకి ఉండకపోవచ్చని.. అంతర్గతంగా ఉన్న వైరసే మళ్లీ విజృంభించినట్టు భావిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.

ఇలా మళ్లీ తిరగబడుతుండడంతో వ్యాధి మరింత మందికి సోకుతుందని.. దీనికి అంతం లేదా అన్న భయం నెలకొంది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది.