Begin typing your search above and press return to search.
కిమ్ ను చంపేందుకు పక్కా ప్లాన్..!
By: Tupaki Desk | 14 Sep 2017 4:50 AM GMTప్రపంచదేశాల మాటలను లెక్క చేయకుండా.. ఐక్యరాజ్యసమితి ఆదేశాలను ధిక్కరిస్తూ.. రోజుకో క్షిపణి పరీక - అణు పరీక్షలు చేస్తూ ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కు రోజులు దగ్గర పడ్డాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అణు బాంబులు విసిరి అమెరికాను భస్మీపటలం చేస్తానంటూ.. ఆ దేశంతో అంటకాగుతున్నందుకు దక్షిణ కొరియాకు - జపాన్ లకు కూడా ఇదే గతి పట్టిస్తానంటూ రెచ్చిపోతున్న కిమ్ జోంగ్ ఉన్ ను చంపడానికి పక్కా ప్రణాళిక సిద్ధమవుతుందంట. అయితే చేసేది మాత్రం ఇలాంటి పనులు చేయడంలో ఆరితేరిన అమెరికా కాదండీ.. ఉత్తర కొరియాకు పొరుగునే ఉన్న దక్షిణ కొరియా. తమ దేశాలకు ముప్పుగా పరిణమించిన కిమ్ జాంగ్ ఉన్ ను అంతమొందించేందుకు శత్రుదేశాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
ముఖ్యంగా తనకు పక్కలో బల్లెంలా మారిన కిమ్‌ను ఎలాగైన చంపాలని నిర్ణయించుకున్న దక్షిణ కొరియా.. దీని కోసం ప్రత్యేకంగా ఓ టీమ్ ను ఏర్పాటు చేసిందని వార్తలు వస్తున్నాయి. కిమ్ ను చంపేందుకు వారికి ప్రత్యేకమైన శిక్షణను ఇస్తోంది. ‘స్పార్టన్ 3000’ పేరుతో ఉన్న ఈ టీమ్ ఉత్తర కొరియాలోకి చొరబడి ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ను అంతమొందించాలనేది ప్లాన్. ఇలా ఉత్తరకొరియాలోకి చొరబడిన ప్రత్యేక టీమ్.. చేతికి దొరికిన ఉత్తరకొరియన్ల తలలు నరికేస్తుంది అని ఆదేశానికి చెందిన నిపుణులు అంటున్నారు.
అయితే ఇలాంటి టీమ్ లను తయారుచేసి ఉత్తర కొరియాలోకి పంపడం దక్షిణ కొరియాకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సంగ్ 2 ను చంపడానికి ఇదే మాదిరిగా ప్రయత్నించింది.అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. కిమ్ సంగ్ ను చంపడానికి ప్రయత్నించిన వారిలో కొందరు పారిపోయి సురక్షితంగా దక్షిణ కొరియా చేరుకోగా, మరికొందరు ఉత్తర కొరియన్లకు చిక్కకుండా తమను తామే చంపుకోవడం గమనార్హం. చూద్దాం ఈసారి గెలుపెవరిదో..