Begin typing your search above and press return to search.

కియా మోటార్స్ ఉద్యోగుల కోసం కొరియన్ సూపర్ మార్కెట్

By:  Tupaki Desk   |   28 July 2021 3:35 PM GMT
కియా మోటార్స్ ఉద్యోగుల కోసం కొరియన్ సూపర్ మార్కెట్
X
ఏపీలోని రాయలసీమలో గల వెనుకబడి అనంతపురం జిల్లాకు గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భారీ పెట్టుబడి వచ్చింది. కొరియన్ కార్ల కంపెనీ 'కియా' అనంతపురంలో తయారీ ప్లాంట్ ను పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడ ఇప్పుడు పారిశ్రామిక అభివృద్ధి బాగా జరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా కియా మోటార్స్ నిలిచింది. దీన్ని చంద్రబాబు రాయలసీమకు తీసుకొచ్చారు.

రెండేళ్ల క్రితం ప్రభుత్వం మారిన తర్వాత కూడా రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఇదే అతిపెద్ద పెట్టుబడిగా మిగిలిపోయింది. ప్రధాన ప్లాంట్ తోపాటు , ఉత్పత్తిని పూర్తి చేయడానికి అనేక సహాయ యూనిట్లు కూడా ఉన్నాయి.

ఇక ఈ దక్షిణ కొరియా ప్లాంట్ లో పనిచేయడానికి అనంతపురానికి దక్షిణ కొరియా నుంచి చాలా మంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చారు. ఈ క్రమంలోనే కియా కంపెనీ వారి ఆహార అవసరాలు తీర్చేందుకు గొప్ప నిర్ణయం తీసుకుంది.

కియా అనంతపురం కార్ల కంపెనీలో పనిచేసే దక్షిణ కొరియా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక 'కొరియన్ సూపర్ మార్కెట్'ను ఏర్పాటు చేసింది. ఇందులో దక్షిణ కొరియాలో లభించే అన్ని ఉత్పత్తులను దిగుమతి చేసుకొని సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉంచింది. కొరియన్క వంటలను అందించే పలు రెస్టారెంట్లను కంపెనీ ఏర్పాటుకు ప్రోత్సహించింది. దీంతో ఇప్పుడు కియా కంపెనీ చుట్టుపక్కల అంతా కొరియన్ వాతావరణం నెలకొంది.

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో కియా మోటార్స్ సంస్థ కార్ల తయారీ ప్లాంట్ ను నిర్మించింది. దేశంలోనే కియాకు ఇది మొట్టమొదటిది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా తొలికారును ఆవిష్కరించారు. అయితే అది ఇక్కడ ఉత్పత్తి అయిన కారు కాదని.. పూర్తిస్థాయిలో కారు తయారు కాలేదని విమర్శలు గతంలో వచ్చాయి. కియా కారు బేసిక్ ధర కూడా చాలా ఎక్కువ. 9 లక్షల నుంచి 18లక్షల వరకూ ఖరీదైంది.