Begin typing your search above and press return to search.
పేరు హోం వర్క్..చూసేది బ్లూ ఫిలీంలు
By: Tupaki Desk | 15 Dec 2016 6:59 AM GMTవిద్యార్థుల్లో పెరుగుతున్న ప్రమాదకర పోకడలకు ఇదో ఇబ్బందికరమైన నిదర్శనం. హోం వర్కు పేరుతో ఇంటి నుంచి వెళుతున్న విద్యార్థులు ఈ క్రమంలో బ్లూ ఫిలీంలు చూస్తు చెడుదారులు పడుతున్నారు. అర్దరాత్రి దాటే వరకు ఇలా నీలి చిత్రాలు చూస్తున్న 13-15 ఏళ్ల లోపు విద్యార్థులు అనంతరం మరుసటి రోజు స్కూల్ కు డుమ్మా కొడుతున్నారు. హైదరాబాద్ పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గల ఇంటర్నెట్ కేఫ్ లపై సౌత్ జోన్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించిన సందర్భంగా ఈ ఆశ్చర్యం వెలుగులోకి వచ్చింది.
తమ పిల్లలు హోంవర్కులు - ప్రాజెక్టుల పేరుతో పేరిట ఎక్కువ సేపు ఇంటర్నెట్ సెంటర్లలో గడుపుతున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు పోలీసులు ఇంటర్నెట్ కేంద్రాలపై దాడులు జరిపారు. నిబంధనల ప్రకారం ఇంటర్నెట్ కేఫ్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోగా, మైనర్లను అసభ్యకర వీడియోలకు దూరంగా ఉంచాలన్న కనీస ప్రమాణాలు పాటించని 16 సైబర్ కేఫ్ లపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. అదేవిధంగా ఇటీవల పాతబస్తీలోని 92 ఇంటర్నెట్ కేఫ్ లలో తనిఖీలు నిర్వహించామని, 37 కేసులు నమోదు చేసి - 47 మంది మైనర్లను అదుపులో తీసుకుని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి - మళ్లీ ఇంటర్నెట్ కేఫ్ ల వద్ద కనిపిస్తే చర్య తీసుకుంటామని హెచ్చరిస్తూ వదిలిపెట్టామని డీసీపీ వివరించారు.
కాగా ఇలా అశ్లీష వీడియోలతో పాటు ప్రమాదకరమైన వీడియోలు చూస్తూ విద్యార్థులు రిస్క్ పాలవుతున్నారని పోలీసులు అంటున్నారు. బైక్ రేసింగ్ లు - ఇతర స్టంట్ ల వీడియోల రూపంలో చూస్తున్న విద్యార్థులు వాటిని ప్రత్యక్షంగా చేయడానికి ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తల్లిదండ్రులు తమకు ఫిర్యాదుల చేశారని వివరిస్తున్నారు. ఇలాంటి అవాంచనీయ పరిణామాలు తలెత్తకుండా ఇటు కుటుంబ సభ్యులు, అటు స్కూల్ యాజమాన్యాలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/