Begin typing your search above and press return to search.
దాదా.. ఇదేమైనా బాగుందా?
By: Tupaki Desk | 3 Jun 2022 8:30 AM GMTసౌరభ్ గంగూలీ.. టీమిండియాకు దూకుడు నేర్పిన నాయకుడు. ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసం నింపిన సారథి. కుర్రాళ్లకు అవకాశం ఇస్తూ.. వారు రాటుదేలేలా చేసిన మార్గదర్శి. ఆటగాడిగా ఉన్నప్పుడు.. కెప్టెన్ గా కొనసాగినప్పుడు.. పునరాగమనం చేసిన తర్వాత.. బీసీసీఐ అధ్యక్షుడు అయ్యాక.. గంగూలీది ప్రత్యేక ముద్ర.
కోహ్లికి ఖో చెప్పాక..
సరిగ్గా ఆరు నెలల కిందటి వరకు విరాట్ కోహ్లి టీమిండియా కెప్టెన్ గా తప్పుకొంటాడని ఎవరైనా ఊహించారా? అసలు రోహిత్ శర్మకు ఒక్క ఫార్మాట్ లోనైనా సారథ్యం దక్కుతుందని ఎవరైనా భావించారా? కానీ, అదే జరిగింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ముద్ర ఏమిటో ఇక్కడే తెలిసిపోతోంది. బలమైన వ్యక్తిత్వం ఉన్నసౌరభ్.. జట్టు విశాల ప్రయోజనాల రీత్యా కోహ్లిని కెప్టెన్ గా పక్కనపెట్టేందుకూ వెనుకాడలేదు. దీనిపై కోహ్లి-బీసీసీఐ మధ్య పెద్దఎత్తున వివాదం నడిచింది.
రాజకీయాల్లోకి రారమ్మంటూ..
గంగూలీని బెంగాల్ రాజకీయాల్లోకి తీసుకురావాలనేది బీజేపీ పెద్దల ప్రయత్నం. అతడికి ఆసక్తి ఉన్నదా? లేదా? అన్నది తర్వాతి సంగతి. గంగూలీకి ఉన్న కరిష్మా రీత్యా అతడిని బెంగాల్ రాజకీయ క్షేత్రంలో మమతా బెనర్జీని ఎదుర్కొనేందుకు ఆయుధంగా వాడుకోవాలని భావిస్తుండవచ్చు. ఈ నేపథ్యంలోనే గతేడాది ఎన్నికలకు ముందు గంగూలీపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతోనే అతడు అస్వస్థతకు గురయ్యాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే, అదంగా మర్చిపోయి సాగుతున్న సమయంలో.. ‘‘1992లో ఆరంభమైన నా క్రికెట్ ప్రయాణం 2022 నాటికి 30 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి క్రికెట్ నాకు ఎంతో ఇచ్చింది. ముఖ్యంగా మీ అందరి మద్దతును అందించింది.
ఈ ప్రయాణంలో భాగమైన వాళ్లు, మద్దతుదారులు, నేను ఇక్కడి వరకు రావడంలో సాయపడిన వాళ్లు అందరికీ ధన్యవాదాలు చెప్పాలని అనుకుంటున్నా. ఈరోజు మరింత మందికి సహాయం అందిస్తుందనిపించే ఒక కొత్త నిర్ణయం తీసుకుంటున్నా. జీవితంలో ఈ కొత్త దశలోకి అడుగుపెట్టే సమయంలో మీ మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా’’ అని బుధవారం గంగూలీ చేసిన ట్వీట్ క్రికెట్, ఇటు బెంగాల్ రాజకీయాల్లో సంచలనం రేపింది.
ఈ ట్వీట్ రాగానే బీసీసీఐకి గంగూలీ త్వరలోనే రాజీనామా ఇస్తున్నాడని.. బీజేపీలో చేరనున్నట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వచ్చాయి. అనంతరం బీసీసీఐ కార్యదర్శి జై షా కల్పించుకుని గంగూలీ బీసీసీఐ పదవికి రాజీనామా చేయలేదని ప్రకటించినా కూడా ఈ ఊహాగానాలకు తెరపడలేదు. తాజాగా గంగూలీ తన రాజకీయ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
తూచ్.. రాజకీయాలు కాదంటూ..
"ఇంతకుముందు చేసిన ట్వీట్ వల్ల నేను చాలా ప్రశ్నలను ఎదుర్కొంటున్నా. నిస్వార్థంగా సేవ చేస్తూ దేశ ప్రగతికి కారణమవుతోన్న కొంత మందికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. కొన్నేళ్లుగా మనం దేశంలో విజయవంతమైన హీరోలను, ప్లేయర్లను, సీఈవోలను చూస్తున్నాం. అయితే వారి సక్సెస్ కు కారణమైన కోచ్ లు, టీచర్లకు సాయం చేసేందుకు నేను నడుం బిగించాలని అనుకున్నా’’అంటూ గంగూలీ మరో ట్వీట్ చేశాడు. దాంతో తాను రాజకీయాల్లోకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని గంగూలీ చెప్పకనే చెప్పాడు.