Begin typing your search above and press return to search.

రాహుల్ సినిమా చూస్తే..శోభ‌నంతో లింక్ పెట్టాడు

By:  Tupaki Desk   |   20 Dec 2017 12:41 PM GMT
రాహుల్ సినిమా చూస్తే..శోభ‌నంతో లింక్ పెట్టాడు
X
బాధ్య‌తాయుత‌మైన నాయ‌కులు...త‌మ ప్ర‌తిమాట‌ను జాగ్ర‌త్త‌గా వాడాల్సి ఉంటుంది. విశ్లేష‌ణ‌లు...ఉప‌మానాలు వాడేట‌ప్పుడు మ‌రింత శ్ర‌ద్ధ అవ‌స‌రం. కానీ అలాంటి సంయ‌మ‌నం లేక‌పోవ‌డం వ‌ల్ల ఇటీవ‌లే కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ప‌గ్గాలు చేప‌ట్టిన రాహుల్ గాంధీని ఆయ‌న మిత్ర‌ప‌క్ష పార్టీ నేత నరేశ్ అగ‌ర్వాల్ బుక్ చేశారు. సెటైరిక‌ల్ కామెంట్లు చేయ‌డంలో ముందుండే సమాజ్‌ వాదీ పార్టీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్ తాజాగా రాహుల్‌ ను ఘోరంగా బుక్ చేశారు.

ప్ర‌తిప‌క్ష బీజేపీకి కౌంట‌ర్ ఇచ్చే స‌మ‌యంలో ఆయ‌న రాహుల్‌ ను బుక్ చేశారు. ఇటీవ‌ల వెలువ‌డిన గుజ‌రాత్‌ - హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఫ‌లితాల‌పై బీజేపీ ఓ షాకింగ్‌ కామెంట్ చేసింది. ఆ రెండు రాష్ర్టాల్లో ఓడిపోయిన బాధ‌లో కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఉంటే రాహుల్‌ గాంధీ మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఢిల్లీలోని ఓ మాల్‌ లో ‘స్టార్‌ వార్స్‌’ సినిమా చూశారని ఆరోపించింది. దీనికి కౌంట‌ర్ ఇచ్చేందుకు సిద్ధ‌మైన న‌రేశ్ అగ‌ర్వాల్ ఈ క్ర‌మంలో శోభ‌నం ఎపిసోడ్‌ ను తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు.

రాహుల్ వ్య‌క్తిగ‌త విష‌యాలు మాట్లాడ‌టం ద్వారా బీజేపీ త‌న సంకుచిత్వాన్ని నిరూపించుకుంద‌ని న‌రేశ్ అగ‌ర్వాల్ ఆరోపించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చిత్ర‌మైన పోలిక తెచ్చారు. `ఒక రాజకీయ నాయకుడి శోభనం రాత్రికి ముహుర్తం కుదురుతుంది.. సరిగ్గా అదే రోజు ఏ ఎన్నికల ఫలితాలో వెలువడ్డాయనుకోండి.. ఆ నేత ఫస్ట్‌ నైట్‌ ను రద్దు చేసుకుంటాడా? బీజేపీ సంకుచితంగా ఆలోచిస్తోంది.` అని మండిప‌డ్డారు.

అయితే కౌంట‌ర్ ఇవ్వ‌డానికి చేసిన ఈ కామెంట్లు న‌రేశ్ అగ‌ర్వాల్‌ను వివాదంలో ప‌డేశాయి. ఇలాంటి పోలిక‌ను తీసుకురావ‌డం ఏంట‌ని కాంగ్ర‌స్ నేత‌లే ఆయ‌న‌పై మండిప‌డటం గ‌మ‌నార్హం.