Begin typing your search above and press return to search.
పులి ఇంకా బ్రతికే ఉందంటున్న ఎస్పీ సీనియర్ నేత!
By: Tupaki Desk | 3 March 2020 4:30 PM GMTసమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత అమర్ సింగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మధ్య అనారోగ్యం తో భాదపడుతూ ..గత కొన్ని రోజులుగా హాస్పిటల్ బెడ్ కే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో అయన ఇక లేరు అంటు సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. దీనికి అమర్ సింగ్ బదులిస్తూ .. తాజాగా ఆయన ఒక వీడియోను పోస్ట్ చేసారు. ఆ వీడియో కి క్యాప్షన్ గా ‘టైగర్ అభీ జిందా హై’ అని రాశారు. ఈ వీడియో ద్వారా తాను బతికే ఉన్నానని, కానీ , ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని తెలియజేశారు. అయితే, నేను ఆరోగ్యం బాగాలేక , హాస్పిటల్ లో ఉంటే .. తాను చనిపోయానని కొంతమంది సోషల్ మీడియాలో వార్తలు వ్యాపింపజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కన్నా తన ఆరోగ్యం ప్రస్తుతం కొంచెం మందగించిందని, అయితే తాను చాలాసార్లు నేను మృత్యుముఖం దగ్గరకు వెళ్లి, పోరాడి మళ్లీ తిరిగివచ్చానని తెలిపారు.
ఇక అయన పోస్ట్ చేసిన వీడియోలో ఏంచెప్పారంటే ... సింగపూర్ నుంచి అమర్‌సింగ్‌ను మాట్లాడుతున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్నాను. నమ్మకం, ఉత్సాహం అలానే ఉన్నాయి. నా శ్రేయోభిలాషులు, స్నేహితులు... నన్ను యమరాజు తన దగ్గరకు పిలుస్తున్నాడనే అపవాదులను వ్యాపింపజేస్తున్నారు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. నాకు వైద్య చికిత్స కొనసాగుతోంది. అమ్మవారి కృప ఉంటే అనారోగ్యం నుంచి బయటపడి, రెండింతల శక్తితో తిరిగివస్తాను. నా మృత్యువును కోరుకుంటున్న మిత్రులు, ఇటువంటి ఆశలను వదిలేయండి. చాలాసార్లు మృత్యువు నా తలుపు తట్టింది. ఒకసారి విమానం నుంచి పడిపోయినా యముడు నన్ను స్వీకరించలేదు. పదేళ్ల క్రితం ఝాన్సీలో జరిగిన ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఆ తరువాత పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను’ అని తెలిపారు. అలాగే ఇంకా అయన మాట్లాడుతూ .. 'నాకు చికిత్సనందిస్తున్న వైద్యులు చెప్పినదాని ప్రకారం నా మెదడు పదేళ్ల పిల్లాడి మెదడు కన్నా ఉత్సాహంగా పనిచేస్తున్నదన్నారు. అయినప్పటికీ నా మృత్యువును కోరుకుంటూ వదంతులు వ్యాపింపజేస్తున్న శ్రేయోభిలాషులకు కోటి,కోటి ధన్యవాదాలు’ అని తెలిపారు. మొత్తంగా మరోసారి అమర్ సింగ్