Begin typing your search above and press return to search.
స్పెయిన్ ఉప ప్రధానికి - మంత్రికి కరోనా?
By: Tupaki Desk | 13 March 2020 7:50 AM GMTచైనాలో సోకిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. కరోనా పేరు చెబితేనే ప్రజలు బెంబేలేత్తిపోతున్నారు. ప్రస్తుతం కరోనా 120కిపైగా దేశాలకు పాకింది. కరోనాతో 4వేల మంది మృత్యువాతపడగా లక్షకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇండియాలోనూ 73కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా బాధితుల లిస్టు లో ఏకంగా మంత్రులు - ప్రధానులే చేరుతుండటం తో ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవలే బ్రిటన్ వైద్యఆరోగ్య శాఖ మంత్రి నాడిన్ డోరీస్ కు కరోనా వైరస్ సోకింది. మంత్రికి వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వైద్యుల సలహాపై మేరకు ముందుజాగ్రత్త చర్యగా ఇంట్లోనే ఐసోలేషన్ గదిలో ఉంటున్నానని నాడిన్ డోరీస్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. తాజాగా స్పెయిన్ మంత్రి ఇరేనే మాంటెరో కరోనాకు సోకింది. తనకు కోవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని ఆమె ట్విటర్ లో వెల్లడించారు. ప్రస్తుతం ఇంటి వద్దనే తనకు ప్రత్యేకంగా చికిత్స తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు.
అదేవిధంగా మంత్రి ఇరేనే భర్త - స్పెయిన్ ఉప ప్రధాని పబ్లో ఇగ్లెసియా తన కరోనా పరీక్షల ఫలితం కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో స్పెయిన్ అధికారులు - ప్రజాప్రతినిధులుంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలంటూ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు యూకేలో 380 కరోనా కేసులు నమోదు కాగా ఆరుగురు చనిపోయారు. చైనా వెలుపల గత రెండు వారాలుగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇది ప్రజల్లో ఒకింత ఆందోళన కలిగిస్తుంది.