Begin typing your search above and press return to search.

కరోనా ఎఫెక్ట్ .. ఏపీలో మంత్రి, స్పీకర్ కార్యాలయాల క్లోజ్ !

By:  Tupaki Desk   |   9 July 2020 11:50 AM GMT
కరోనా ఎఫెక్ట్ ..  ఏపీలో మంత్రి, స్పీకర్ కార్యాలయాల క్లోజ్ !
X
ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. రోజురోజుకి నమోదు అయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో అందరిలో ఆందోళన మొదలైంది. సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ ఈ వైరస్ భారిన పడుతుండటంతో ప్రభుత్వ పెద్దల్లో కూడా ఆందోళన మొదలైంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు , ప్రముఖులు కరోనా భారిన పడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద పనిచేసే సహాయ సిబ్బందికి సైతం కరోనా సోకింది.

ఈ నేపథ్యంలో నేటి నుంచి క్యాంపు కార్యాయాలు మూసివేయాలని స్పీకర్, ఓ మంత్రి నిర్ణయం తీసుకున్నారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం క్యాంపు కార్యాలయాలు ఇవాల్టి నుంచి మూసివేశారు. గురువారం నుంచి తమని కలిసేందుకు 15 రోజులు వరకు ఎవరూ రావద్దని ప్రకటన విడుదల చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చాలామంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని.. ప్రజలతో కలుస్తూ కరోనా బారిన పడ్డారు. దీనితో ముందు జాగ్రత్తగా స్పీకర్, మంత్రి ధర్మాన తమ అధికారిక కార్యాలయాల్ని బంద్ చేయించారు.

ఇకపోతే, మరోవైపు ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది. రోజుకు దాదాపు వేయి కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, ఏపీ వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,555 కొత్త కేసులు నమోదయ్యాయి . తాజా కేసులతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 23,814కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 12,154 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 277 మంది చనిపోయారు.