Begin typing your search above and press return to search.
వాళ్లిక తమ్ముళ్లు కాదు.. గులాబీ నేతలు
By: Tupaki Desk | 10 March 2016 3:38 PM GMTతెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి తాజాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది నెలల నుంచి కొన్ని రోజుల క్రితం వరకూ వాయిదాల వారీగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి తెలంగాణ అదికారపక్షంలోకి జంప్ అయిన ఎమ్మెల్యేలకు కొత్త గుర్తింపు వచ్చేసింది. రోజు క్రితం టీటీడీపీ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్.. అరికెపూడి గాంధీలు తెలంగాణ స్పీకర్ ను కలిసి.. తెలంగాణ తెలుగుదేశం పార్టీని అధికారపక్షంలోకి విలీనం చేయాలని.. తమను తెలంగాణ అధికారపక్షానికి అనుబంధ సభ్యులుగా గుర్తించాలని కోరారు.
వారి వినతిని స్వీకరించిన తెలంగాణ స్పీకర్.. తాజాగా నిర్ణయం తీసుకున్నారు. టీటీడీపీ నుంచి జంప్ అయిన 12 మంది ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ అనుబంధ సభ్యులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుంటూ.. అందుకు తగ్గ బులిటెన్ ను విడుదల చేశారు. దీంతో.. ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం కాస్తా అధికారికంగా పార్టీ విలీనమైనట్లుగా మారిపోయిన పరిస్థితి. సో.. నిన్నటి వరకూ జంపర్స్ అన్న పేరుతో విమర్శించే వారు. . ఇకపై వారిని టీఆర్ ఎస్ నేతలుగా గుర్తించాల్సి ఉంది.