Begin typing your search above and press return to search.

గులాబీ పార్టీలో కాంగ్రెస్ విలీనం సంపూర్ణం..!

By:  Tupaki Desk   |   7 Jun 2019 5:41 AM GMT
గులాబీ పార్టీలో కాంగ్రెస్ విలీనం సంపూర్ణం..!
X
టార్గెట్ చేసింది పూర్తి చేసే వ‌ర‌కు గులాబీ బాస్ కేసీఆర్ కు తృప్తి ఉండ‌దంటారు. ఒక‌సారి ఫిక్స్ అయితే.. వెన‌క్కి వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌ని కేసీఆర్‌.. తెలంగాణ‌లో తాను త‌ప్పించి మ‌రే విప‌క్షం ఉండ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ఆయ‌న‌.. అందులో భాగంగా విపక్షాల్ని మొద‌లుకంటా న‌రికేసే కార్య‌క్ర‌మాన్ని విలీనం పేరుతో మొద‌లెట్టిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ప‌లువురిని టీఆర్ ఎస్ లోకి చేర్చుకునే కార్య‌క్ర‌మానికి విలీనం పేరుతో పూర్తి చేశారు.

అసెంబ్లీలో 19 మంది స‌భ్యులున్న కాంగ్రెస్ పార్టీ బ‌లం తాజా విలీనం కార‌ణంగా ఆరుకు ప‌డిపోయింది. దీంతో.. కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన ప్ర‌తిపక్ష పార్టీ హోదాను కోల్పోవ‌టంతో పాటు.. అధికార‌ప‌క్షం త‌ర్వాత పెద్ద పార్టీ గుర్తింపును మిస్ అయ్యింది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో 18 మంది స‌భ్యులున్న బ‌లం కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భాపక్షంలో మూడింట రెండొంతుల బ‌లం ఉన్న త‌మ‌ను టీఆర్ఎస్ లో విలీనం చేయాలంటూ 12 మందితో కూడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీక‌ర్ ను కోర‌టంతో విలీన కార్య‌క్ర‌మం షురూ అయ్యింది.

భార‌త రాజ్యాంగం 10వ షెడ్యూల్ నాలుగో పేరాలోని రెండో స‌బ్ పేరాతో త‌మ‌ను త‌క్ష‌ణం టీఆర్ ఎస్ స‌భ్యులుగా గుర్తించాల‌ని కోరటం.. ఆ వెంట‌నే స్పీక‌ర్ వారి కోరిక‌ను మ‌న్నించ‌టం జ‌రిగిపోయాయి. దీంతో.. గులాబీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ శాస‌న‌స‌భాప‌క్షాన్ని విలీనం చేసే కార్య‌క్ర‌మం విజ‌య‌వంతంగా పూర్తి అయ్యింద‌ని చెప్పాలి. గురువారం మ‌ధ్యాహ్నం కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు విలీనం కోసం స్పీక‌ర్ ను రిక్వెస్ట్ చేయ‌గా.. వారి మాట‌ను మ‌న్నించిన స్పీక‌ర్.. గురువారం రాత్రి విలీనం పూర్తి అయ్యింద‌న్న విష‌యాన్ని వెల్ల‌డిస్తూ బులిటెన్ ను విడుద‌ల చేశారు. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామంతో తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ ఎస్ నేత‌ల స‌ర‌స‌న తాజాగా విలీన‌మైన కాంగ్రెస్ నేత‌ల సీట్ల‌ను కేటాయించ‌నున్నారు.