Begin typing your search above and press return to search.
స్పీకర్‌నే అవమానించిన మీడియా
By: Tupaki Desk | 15 Oct 2015 3:58 PM GMTఒక్కోసారి మీడియా అత్యుత్సాహం వాస్తవాలు గ్రహించుకుండా, పెద్ద మనుషులు అనే తేడా లేకుండా ఇబ్బందులు పెడుతుంది. ఈ క్రమంలో అనారోగ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాలను కూడా పట్టించుకోకపోవడం బాధాకరం. కేరళ స్పీకర్ ఎన్.శక్తన్ ఇదే తరహా అత్యుత్సాహంతో ఇబ్బందిపడ్డ ఘటన ఇపుడు సంచలనం అయింది.
స్పీకర్ హోదాలో ఉన్న శక్తన్ కాళ్లకు ఆయన సహాయకుడు చెప్పులు తీస్తున్నట్లుగా ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ చిత్రాన్ని చూసిన వారంతా శక్తన్ ను వారి శక్తి మేరకు విమర్శించారు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవారు ఈ విధంగా చేయడం ఏంటని మండిపడ్డారు. అయితే అసలు విషయాలను శక్తన్ వెల్లడించి వారి అత్యుత్సాహానికి చెక్ పెట్టారు. గత 18 ఏళ్లుగా తాను కళ్లకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నానని శక్తన్ తెలిపారు. వైద్యులు తనను ముందుకు వంగకుండా ఉండాలని సూచించారని , అందువల్లే తన బంధువు తనకు చెప్పులు తీయడంలో సహాయం చేశాడని శక్తన్ వివరించారు. 33 ఏళ్లుగా తాను ఎమ్మెల్యేగా ఉన్నాననీ, అలాంటి సీనియర్ అయిన తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోకుండా ఈ విషయాన్ని ప్రముఖంగా చూపించడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు. వీటన్నింటికి తోడు తాను ఓ ప్రైవేటు కార్య్రక్రమానికి హాజరైనప్పుడు ఆ ఫోటో తీశారని ఆక్షేపించారు. వాస్తవాలు తెలుసుకోకుండా, అసందర్భమైన పరిస్థితుల్లో తీసిన ఫొటోలతో వివాదం జరుగుతుండడం తనను కలచి వేసిందని శక్తన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మీడియా ఈ విషయాన్ని పెద్దదిగా చేసి చూపించడం తగదని శక్తన్ సూచించారు.