Begin typing your search above and press return to search.

అమెరికావోడు ఆందోళన చేస్తే భారత్ ను అనుడేంది?

By:  Tupaki Desk   |   27 Jun 2016 5:47 AM GMT
అమెరికావోడు ఆందోళన చేస్తే భారత్ ను అనుడేంది?
X
హుందాగా సభను నిర్వహించే విషయంలో అమెరికా సభలు ఉదాహరణలుగా నిలుస్తాయని చెబుతారు. అయితే.. ప్రభుత్వాల మొండి వైఖరి అలాంటి హుందాతనాన్ని పక్కన పెట్టేలా చేస్తాయన్న విషయం తాజాగా చోటు చేసుకున్న పరిణామం ఒకటి స్పష్టం చేసింది. ఇదంతా బాగానే ఉన్నా.. అమెరికాలోని ప్రతినిధుల సభలో సభ్యులు చేపట్టిన ఆందోళన.. భారత్ లోని రాజ్యసభలో చోటు చేసుకునే గందరగోళంతో సరిపోతుందంటూ ఒక అమెరికా సభ్యుడు వ్యాఖ్యనించటం గమనార్హం.

అర్లాండో నరమేథం తర్వాత దేశంలో తుపాకుల నియంత్రణకు కఠిన చట్టాలు తీసుకురావాలంటూ అమెరికా ప్రతినిధుల సభలో డెమోక్రాటిక్ సభ్యులు కొందరు ఆందోళనలునిర్వహించారు. తమ ఆందోళనలో భాగంగా స్పీకర్ పోడియం చుట్టూ చేరుకున్న నేతలు.. తమ నిరసన వ్యక్తం చేశారు. ఇలా స్పీకర్ చుట్టూ చేరి ఆందోళన చేయటంపై రిపబ్లికన్ పార్టీ నేత మార్క్ మేడోన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు.

భారత్ లోని రాజ్యసభలో ఈ తరహా ఆందోళనలు చేస్తారంటూ వ్యాఖ్యనించిన ఆయన.. ‘‘వేరే ప్రభుత్వాలు ఈ విధంగా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ.. ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా ఉండే అమెరికా వారిని అనుసరించకూడదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. అయినా.. అమెరికావోడు ఆందోళన చేస్తే.. దానికి మనతోనే పోలికా? ఇలా పోలికలు చెప్పుకోవటానికి ప్రపంచంలో మరే దేశం లేదా?