Begin typing your search above and press return to search.

స్పీక‌ర్ ఆదేశం: ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు భ‌ద్ర‌త క‌ల్పించండి

By:  Tupaki Desk   |   23 Jun 2020 11:30 PM GMT
స్పీక‌ర్ ఆదేశం: ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు భ‌ద్ర‌త క‌ల్పించండి
X
ఆంధ్రప్ర‌దేశ్‌లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున నరసాపురం ఎంపీగా గెలిచిన‌ రఘురామ కృష్ణంరాజు వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీపై, పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జగన్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అత‌డిపై వైఎస్సార్సీపీ నాయ‌కులు విరుచుకుప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో హ‌ఠాత్తుగా తనకు భద్రత కల్పించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు లోక్‌స‌భ‌ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. త‌న‌కు ప్రాణహాని ఉంది అని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని రఘురామ లేఖలో తెలిపారు.

అత‌డి లేఖ‌ను ప‌రిశీలించిన అనంత‌రం స్పీకర్ స్పందించారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు హోంశాఖ భద్రత కల్పించాల‌ని ఆదేశించారు. సొంత పార్టీ, సీఎం జగన్‌పై విమర్శలు చేయడంతో వైఎస్సార్సీపీ నేతలు అతడిని ల‌క్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రఘురామ తన భద్రత గురించి ఆందోళ‌న చెందుతున్నారు. ఈ విష‌య‌మై స్పీకర్‌కు లేఖ రాశారు. భద్రత కల్పించాలని స్వయంగా ఎంపీ కోరడంతో హోంశాఖ భద్రత కల్పించనుంది.

స్పీకర్ సూచనల మేరకు హోంశాఖ భద్రత ఇవ్వనుంది. సీఆర్పీఎఫ్ లేదంటే సీఐఎస్ఎఫ్ జవాన్లతో ఎంపీలకు ప్రొటెక్షన్ ఇస్తుంటారు. ఇప్పుడు రఘరామకు కూడా అలానే ప్రొటెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తన సొంత పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల నుంచి భద్రత ఇవ్వాలని కోరడంతో ర‌ఘురామ‌కృష్ణంరాజు వైఎస్సార్సీపీకి దూర‌మ‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే తన ప్రాణాలకు ముప్పు ఉందని ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి, లోక్‌స‌భ స్పీక‌ర్‌కు లేఖ రాశారు. ప్రధానికి రెండుసార్లు లేఖ రాయగా.. స్పీకర్‌కు ఒక‌సారి రాశారు.

బీజేపీలో ర‌ఘురామ‌కృష్ణంరాజు చేరతారని ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్‌పై విమర్శలు చేయడం, ప్రభుత్వ పథకాల తీరును తప్పుపట్టడంతో అది వాస్త‌వమేన‌ని తెలుస్తోంది. దీంతో వైఎస్సార్సీపీ నాయ‌కులు అత‌డిని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. వారి విమ‌ర్శ‌ల‌ను రఘురామ కృష్ణంరాజు ప్ర‌తిగా తీవ్రస్థాయిలో స‌మాధానం ఇస్తున్నారు. తనకు భద్రత కల్పించాలని ప్రధాని, స్పీకర్‌కు ఆయన లేఖ రాయ‌గా స్పీకర్ స్పందించి ఈ మేర‌కు హోంశాఖ‌కు ఆదేశించారు.