Begin typing your search above and press return to search.

ఆమె నోటి వెంట సారీ మాట

By:  Tupaki Desk   |   23 Dec 2015 3:20 PM IST
ఆమె నోటి వెంట సారీ మాట
X
అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు నోరుజారితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందో.. తాజాగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యవహారం చూస్తే అర్థమవుతుంది. తొందరపాటుతో ఆమె చేసిన వ్యాఖ్యతో క్షమాపణలు చెప్పాల్సిన ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్రయోజనాలు పట్టవంటూ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యలు చేయటం.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటంతో ఆమె తాను చేసిన వ్యాఖ్యల్ని సమీక్షించుకునే పరిస్థితి ఎదురైంది.

మంగళవారం లోక్ సభలో తాను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటంతో స్పందించిన సుమిత్రా.. తాను ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని.. తానుచేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆమె సారీ చెప్పారు. స్పీకర్ చేసిన వ్యాఖ్యలు తమ మనసుల్ని తీవ్రంగా గాయపర్చాయని కాంగ్రెస్ నేత మల్లిఖార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. సంయమనం విషయంలో ఏ మాత్రంతో తేడా వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందన్న దానికి స్పీకర్ సుమిత్రా ఉదంతమే నిదర్శనంగా చెబుతున్నారు.