Begin typing your search above and press return to search.

నా వల్ల కాదంటు సభ నుంచి వెళ్లి పోయిన స్పీకర్ ..ఏమైందంటే ?

By:  Tupaki Desk   |   21 Jan 2020 6:46 AM GMT
నా వల్ల కాదంటు సభ నుంచి వెళ్లి పోయిన స్పీకర్ ..ఏమైందంటే ?
X
ఆంధప్రదేశ్ లో ప్రస్తుతం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. నేటితో ఈ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సమావేశాలలో భాగంగా సాంఘిక సంక్షేమమంత్రి పినపె విశ్వరూప్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై మంగళవారం అసెంబ్లీ లో ఆందోళన జరిగింది. సభ ప్రారంభమైనప్పటి నుంచీ టీడీపీ సభ్యులు.. జై అమరావతి అని.. స్పీకర్ పోడియంని చుట్టుముట్టి నినాదాలు చేస్తూ సభకు ఆటంకం కలిగించారు. దయచేసి సమావేశాలు సజవుగా సాగాలని వైసీపీ నాయకులు కోరినప్పటికీ టీడీపీ సభ్యులు శాంతించలేదు.

ఈ బిల్లు పై కావాలనే వివక్ష చూపిస్తూ మాట్లాడేందుకు అవకాశమివ్వడం లేదని వైసీపీ నాయకులు వాదించారు. అయినప్పటికీ వేరెవ్వరినీ మాట్లాడనివ్వకుండా టీడీపీ సభ్యులు స్పీకర్ వరకూ వెళ్లి జై అమరావతి అంటూ ముట్టడి ప్రయత్నం చేశారు. స్పీకర్ చెప్పిన వినకుండా తమ ఆందోళనను కనొసాగించారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం తీవ్ర అసహనానికి గురయ్యారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు పై నిరసన వ్యక్తం చేస్తూ ఐ యామ్ ప్రొటెస్టింగ్ ద అటిట్యూడ్ ఆఫ్ టీడీపీ ఎమ్మెల్యేస్ అని కుర్చీలోంచి లేచి బయటకి వెళ్లిపోయారు. గత రెండు రోజులు గా టీడీపీ సభ్యులు సభలో తమ నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దీంతో తన మాట వినడం లేదని తీవ్ర ఆవేదర వ్యక్తం చేస్తూ స్పీకర్ తమ్మినేని సభ నుంచి ఇవాళ వెళ్లి పోయారు. కాగా.. టీడీపీ సభ్యులు నినాదాలు ఆగిన తరువాత.. కాసేపటికి ఆయన మళ్లీ ఆయన స్పీకర్ స్థానానికి వచ్చారు.