Begin typing your search above and press return to search.
రమేశ్ కుమార్ ను సీఎం కుర్చీలో కూర్చోమనండి.. ఏపీ స్పీకర్
By: Tupaki Desk | 16 March 2020 9:31 AM GMTస్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయంపై అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై న్యాయ పోరాటం తో పాటు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్నింటిని సద్వినియోగం చేసుకుని గతం లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగేలా చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరుపై వైఎస్సార్సీపీ నాయకులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఒక స్వతంత్ర సంస్థపై, ఆ సంస్థ అధినేతపై విమర్శలు చేయకూడదని తెలిసినా మంత్రులు, వైఎస్సార్సీపీ నాయకులు బహిరంగంగా ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ పరిణామాలపై స్పందించకూడని వ్యక్తి కూడా స్పందించారు. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా స్పందించారు.
ఎన్నికల సంఘమే అన్ని నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం ఇక దేనికి ఉంది? కమిషనర్ రమేశ్ కుమార్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోమనండి.. అని తెలిపారు. రాజ్యాంగ బద్ధ పదవి లో ఉన్న వ్యక్తి ఒక రాజ్యాంగ సంస్థపై విమర్శలు చేయడం సరికాదు. ఒక స్పీకర్ ఇలాంటి విషయాలపై స్పందించకూడదు.. అయినా ఆయన స్పందించి స్వతంత్ర సంస్థగా ఎన్నికల సంఘం తీరును తప్పుబట్టారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం లో జరిగినా సమావేశంలో సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజ్యంగబద్ధ వ్యక్తులు కులమతాలకతీతంగా ఉండాలని హితవు పలికారు. వెధవలకు పదవులు, గాడిదలకు కొమ్ములొచ్చినా ప్రమాదమేనని తమ్మినేత సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తో సంప్రదించకుండా నోటిఫికేషన్ రద్దు చేసి ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నికల సంఘం పెత్తనమేమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రానికి పట్టింది కరోనా వైరస్ నా.. కమ్మ వైరస్ నా.. చంద్రబాబు తో రమేశ్ కుమార్ కు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేశారు. ఏది చేస్తే అది చెల్లుతుంది అనుకుంటున్నారా.. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలి అని కోరారు. రమేశ్ కుమార్ వంటి వ్యక్తులు కీలక స్థానాల్లో ఉంటే రాజ్యాంగానికి అవమానమని, రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టుపట్టించారని ఒక స్పీకర్ గా తమ్మినేని సీతారామ్ వ్యాఖ్యానించడం గమనార్హం.
న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘంలోనూ బ్లాక్ షీట్స్ ఉన్నాయని, రమేశ్ కుమార్ రాష్ట్రం వాళ్ల అబ్బ జాగీరు అనుకుంటున్నాడా? అని తీవ్ర పదజాలం తో తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి రావాల్సిన 14 ఆర్ధిక సంఘం నిధులు ఎవరిస్తారని తెలిపారు. వెంటనే ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్పందించాలని, చంద్రబాబు నీచ రాజకీయాలకు ప్రజలు గుణపాఠం చెబుతారని జోస్యం చెప్పారు.