Begin typing your search above and press return to search.

విశాఖ లో రాజధాని ని ఆపడం ఎవరి తరం కాదు ..!

By:  Tupaki Desk   |   24 Dec 2019 9:15 AM GMT
విశాఖ లో రాజధాని ని ఆపడం ఎవరి తరం కాదు ..!
X
ప్రస్తుతం ఏపీ మొత్తం రాజధాని వ్యవహారం పై అట్టుడికి పోతోంది. సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు అని ప్రకటించడం తో రాష్ట్రంలో ఈ వేడి మొదలైంది. అమరావతి లోనే రాజధాని ఉంచాలంటూ అమరావతి ప్రాంత ప్రజలు ..ధర్నాలు చేస్తున్నారు. అయితే, ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా, ఉద్యమాలు చేసినా విశాఖ లోనే రాజధాని వచ్చి తీరుతుందని ఖరాఖండిగా చెప్పారు ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని తీర్చే నాయకుడి కోసం కలలు కన్నామని, అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రూపం లో రావటం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు.

మూడు రాజధానులు, నాలుగు ప్రాంతాయ మండళ్ల ఏర్పాటుకు జగన్‌ గొప్ప ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని వదులుకుంటే ఉత్తరాంధ్ర వాసులంతా అజ్ఞానులు మరొకరు ఉండరని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాయకుడంటే దమ్మున్నోడు..నాయకుడంటే గుండెబలమున్నాడో..అలాంటి నాయకుడే మన ముఖ్యమంత్రి జగన్ అని పొగడ్తలు కురిపించాడు. అన్ని ప్రాంతాల కు సమన్యాయం చేస్తుంటే ఉద్యమాలెందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

అమరావతిలో ఉద్యమాలు చేసేదంతా భూములు కొట్టేసి నోళ్లు, పచ్చ చొక్కావాళ్లే అని ఎద్దేవా చేశారు.
విశాఖకు, పాలనా రాజధాని, కర్నూలులో హైకోర్టు కావాలంటున్నారా.వద్దంటున్నారా అని ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. అమరావతి లో లెజిస్లేచర్‌ రాజధాని ఉండాలంటారా..? వద్దంటారా..? అన్నదాని పై మాజీ సీఎం చంద్రబాబు, టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలను కాపాడే ప్రయత్నం చేస్తుంటే, ఉద్యమాలు చేస్తున్నారా, అభివృద్ధి కోసం పనిచేస్తుంటే.., మీకు ఇంకా బుద్దిరాలేదా అని విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా బ్రహ్మ దేవుడు ఉద్యమాలు చేసేవారికి బుద్ధిని ప్రసాధించాలని కోరుకుంటున్నానని అన్నారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.