Begin typing your search above and press return to search.

బీజేపీ ఎంపీ మాట.. సంస్కృతం తో కొలెస్టరాల్, డయాబెటిస్ కు చెక్

By:  Tupaki Desk   |   13 Dec 2019 7:28 AM GMT
బీజేపీ ఎంపీ మాట.. సంస్కృతం తో కొలెస్టరాల్, డయాబెటిస్ కు చెక్
X
పార్లమెంట్ లో చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ గణేష్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుపై చర్చ సందర్భంగా గణేష్ సింగ్ మాట్లాడారు. రోజూ సంస్కృతంలో మాట్లాడితే షుగర్, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవచ్చని ఉచిత సలహా ఇచ్చారు. దీనికి వివరణ కూడా గణేష్ సింగ్ ఇవ్వడం గమనార్హం.

సంస్కృతం మాట్లాడడం ద్వారా నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుందన్నారు. ఇస్లామిక్ భాషలతో సహా ప్రపంచంలోని 97 భాషలకు సంస్కృతమే ఆధారమన్నారు. అంతేకాదు.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సంస్కృతంలో జరిపితే సిస్టమ్ ఆగకుండా పనిచేస్తుందన్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందన్నారు.

ఇప్పటికే నేతల నోరుజారడంపై సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల కూడా నోరుజారి బుక్కయ్యారు. ఆమెపై సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ పడ్డాయి. తాజాగా బీజేపీ ఎంపీ మాటలు నవ్వులపాలవుతున్నాయి.